సినిమా

Trivikram Srinivas _ Samantha: సమంత కోసం త్రివిక్రమ్ ఓ స్పెషల్ స్కెచ్..

Trivikram Srinivas _ Samantha: ఈ నేపధ్యంలో తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సమంత కోసం ఓ వైవిధ్యమైన కథను సిద్ధం చేశాడని టాక్ వినిపిస్తోంది.

Trivikram Srinivas _ Samantha: సమంత కోసం త్రివిక్రమ్ ఓ స్పెషల్ స్కెచ్..
X

Trivikram Srinivas_Samantha: సమంత, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లే.. మళ్లీ ఆ కాంబినేషన్ రిపీటైతే అభిమానులకు పండగే.. సమంత వరుస సినిమాలతో మంచి దూకుడు మీద ఉంది. పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్‌కి మంచి క్రేజ్ వచ్చింది.. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాంకుతలం పూర్తి చేసిన సమంత మరో క్రేజీ ప్రాజెక్ట్ యశోద చేస్తోంది.. ఈ చిత్రంలో నర్స్‌గా ఓ విభిన్న పాత్రను పోషించనుందని సమాచారం. ఈ నేపధ్యంలో తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సమంత కోసం ఓ వైవిధ్యమైన కథను సిద్ధం చేశాడని టాక్ వినిపిస్తోంది.

'అల వైకుంఠపురం'లో సినిమా వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. ఆ తరువాత మరే సినిమా రాలేదు.. ఎన్టీఆర్‌తో సినిమా ఉందని ఓ టాక్ వచ్చింది. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. సినిమాని డైరెక్టర్ చేయకపోయినా పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో వస్తున్న భీమ్లా నాయక్‌ సినిమాకు డైలాగ్స్ రాసే పనిలో బిజీగా ఉన్నారు.

మహేష్ బాబుతో కూడా త్రివిక్రమ్ సినిమా చేయాలనుకున్నారు.. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు.. ప్రస్తుతానికి ఎన్టీఆర్, మహేష్‌లతో సినిమా తీసే విషయాన్ని పక్కన పెట్టి ఓ లేడీ ఓరియంటెడ్ మూవీని ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్.. అందులో హీరోయిన్‌గా సమంతని తీసుకుంటారని టాక్.. ఇందుకు సంబంధించిన ఓ నవల హక్కులను కూడా మాటల మాంత్రికుడు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సమంత ఊ.. కొడితే చాలు ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు తివిక్రమ్.

Next Story

RELATED STORIES