Trivikram Srinivas: త్రివిక్రమ్ గ్యారేజ్‌లో కొత్త బీఎండబ్ల్యు..

Trivikram Srinivas: సోషల్ మీడియాకు దూరంగా ఉండే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఖరీదైన బీఎండబ్ల్యు కారు కొని పోస్ట్ పెట్టారు. స్టార్ హీరోలను మాత్రమే డైరెక్ట్ చేసే త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో అలవైకుంఠపురం తర్వాత మరే చిత్రం రాలేదు అతడి డైరెక్షన్ నుంచి. కానీ కమర్షియల్ యాడ్స్ తీస్తూ అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు.
అక్కడ కూడా అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి హీరోలకు యాడ్స్ డైరెక్ట్ చేస్తూ అటు సినిమాల్లోనూ, ఇటు అడ్వర్టైజ్‌మెంట్ రంగంలోనూ పేరు తెచ్చుకున్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పెద్దగా పంచుకోని త్రివిక్రమ్ బీఎండబ్ల్యు కారుకు సంబంధించిన చిత్రాలను పోస్ట్ చేయడం అభిమానులకు ఆసక్తిని కలిగించింది.
ఇక ఈ లగ్జరీ కారు ధర 1.34 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది వరకే ఆయన గ్యారేజీలో కొన్ని కార్లు ఉన్నా ప్రస్తుతం భార్యతో కలిసి మరో కారును కొనుగోలు చేశారు. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అనుకోని కారణాల వలన క్యాన్సిల్ అయినా.. కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి పట్టాలెక్కడానికి సిద్ధమవుతోంది. త్రివిక్రమ్.. మహేష్‌కి మంచి హిట్టిస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com