సినిమా

Trivikram Srinivas : పవన్ మరో రీమేక్.. రేటు డబుల్ చేసిన త్రివిక్రమ్..!

Trivikram Srinivas : సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో వచ్చిన 'వినోదయ సితం' సినిమాని పవన్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

Trivikram Srinivas : పవన్ మరో రీమేక్.. రేటు డబుల్ చేసిన త్రివిక్రమ్..!
X

Trivikram Srinivas : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మెయిన్ లీడ్‌‌లో వచ్చిన మూవీ భీమ్లానాయక్.. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కి ఇది రీమేక్.. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు. పవన్ సినిమాకి ఇలా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయడం ఇది రెండోసారి. దీనికి ముందు పవన్.. తీన్‌‌మార్ మూవీకి త్రివిక్రమ్ పనిచేశారు. అయితే ఈ రెండు సినిమాలు రీమేక్ అవ్వడం విశేషం.

ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి మరో రీమేక్ కోసం పనిచేయనున్నారు. సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో వచ్చిన 'వినోదయ సితం' సినిమాని పవన్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో సముద్రఖనినే డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ స్క్రిప్ట్ బాధ్యతలను త్రివిక్రమ్ హ్యాండిల్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ రూ. 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.. భీమ్లానాయక్‌‌ సినిమా కోసం మాటల మాంత్రికుడు రూ. 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకోగా, ఇప్పుడు దానిని డబల్ చేశారట.

అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో చిత్రం తర్వాత త్రివిక్రమ్ ఏ సినిమాకు దర్శకత్వం వహించలేదు.. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమాని చేస్తున్నాడు. గ్రాండ్‌‌గా ఈ మూవీ లాంచ్ అయింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

Next Story

RELATED STORIES