సినిమా

Trivikram Srinivas: రీతూ వర్మ నెక్ట్స్ సినిమా టైటిల్స్ ఇవేనా.. త్రివిక్రమ్ సెటైర్లు..

Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మైక్ అందుకున్నారంటే అందరూ ఆసక్తిగా వినాల్సిందే.

Trivikram Srinivas: రీతూ వర్మ నెక్ట్స్ సినిమా టైటిల్స్ ఇవేనా.. త్రివిక్రమ్ సెటైర్లు..
X

Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మైక్ అందుకున్నారంటే అందరూ ఆసక్తిగా వినాల్సిందే. అదిరిపోయే పంచ్ డైలాగులతో.. ఆడియన్స్‌ని అట్టే కట్టిపడేస్తారు. తాజాగా నాగ శౌర్య, రీతూ వర్మ నటించిన 'వరుడు కావలెను' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. హీరోయిన్ రీతూవర్మ ఇప్పటి వరకు నటించిన సినిమా టైటిళ్లపై సెటైర్లు వేశారు.

ఈనెల 29న విడుదలవబోతున్న 'వరుడు కావలెను' సినిమాను నేను చూశాను. చాలా రోజుల తర్వాత సినిమా మొత్తం చీర కట్టిన హీరోయిన్‌ని చూశాను. ఆమె నటించిన సినిమాలన్నీ చూస్తే వరుసగా.. పెళ్లి చూపులు, కనులు కనులు దోచాయంటే.. ఇప్పుడు వరుడు కావలెను.. ఇకపై వచ్చే సినిమాలు షామినా, కేటరింగ్, లాజిస్టిక్ సర్వీసెస్ వంటి పేర్లతో సినిమాలు తీస్తారేమో.

అసలే సినిమావాళ్లకి సెంటిమెంట్స్ ఎక్కువ. ఇకపై ఏ డైరెక్టర్ అయినా నీతో సినిమా తీయాలంటే ఇలాంటి టైటిల్స్ పెట్టి సినిమా తీస్తారేమో.. అని అనేసరికి రీతూ సిగ్గుల మొగ్గైంది.. ముసిముసిగా నవ్వుకుంది.

Next Story

RELATED STORIES