పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్న త్రివిక్రమ్ భార్య

Trivikram Wife: త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న స్నేహం చాలా ప్రత్యేకం. వీరిద్దరి బంధం మరియు స్నేహం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారిని అందరికంటే దగ్గరగా చూసే త్రివిక్రమ్ భార్య సౌజన్య మాటల్లో..
పవన్ కళ్యాణ్ తమ ఇంటికి వచ్చిన ప్రతిసారి, త్రివిక్రమ్‌తో చాలా లోతైన సంభాషణలు జరుగుతాయి. ఎక్కువగా పురాణాల గురించి మాట్లాడుకుంటారు. 'వారి మధ్య గొప్ప స్నేహం ఉంది. ఒకరినొకరు చాలా గౌరవిస్తారు. త్రివిక్రమ్ తన పుస్తకాలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ పవన్ కళ్యాణ్ అడిగితే ఇచ్చేస్తారు. ఒకరికొకరు ఇచ్చుకునే బహుమతులు ఏమన్నా ఉన్నాయి అంటే అవి ఎక్కువగా పుస్తకాలు, పెన్నులు అని చెప్పింది.
పవన్‌కి ఇష్టమైన ఆహార పదార్థాలను గురించి కూడా సౌజన్య పంచుకున్నారు. 'పవన్ కళ్యాణ్‌కు మా ఇంట్లో వండే వంట అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా ఉదయం పూట వస్తే ప్రత్యేకంగా ఉప్మా అడుగుతారు. మధ్యాహ్న భోజనంలో శాఖాహారం, ఆవకాయ తినడం ఆయనకు చాలా ఇష్టం. ఇక స్వీట్స్‌లో అయితే రవ్వ లడ్డూ అంటే చాలా ఇష్టం. మా ఇంటికి వచ్చినప్పుడు తనకు కావలసిన పదార్థాల గురించి అడగడానికి మొహమాటపడరు. మా ఇంట్లో వ్యక్తిలానే ఉంటారు పవన్ అని సౌజన్య చెప్పుకొచ్చారు.
నిర్మాతగా మారిన క్లాసికల్ డ్యాన్సర్ సాయి సౌజన్య స్టార్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ భార్యగా కాక తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆమె 'సర్' చిత్రాన్ని నిర్మించారు.
పవన్ కళ్యాణ్ వినోదయ సీతం రీమేక్ కు త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com