Venkatesh : వెంకటేష్ తో త్రివిక్రమ్ మూవీ.. ఎన్నేళ్ల కల ఇది

కొన్ని కాంబినేషన్స్ కోసం ఫ్యాన్స్ ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంటారు. ఇదుగో అదుగో అనడమే కానీ సెట్ కాదు. అలాంటి కాంబోస్ లో వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో ఒకటి. వెంకీ హీరోగా ఓ సినిమా చేయాలని త్రివిక్రమ్ అనుకున్నాడు. కానీ ఇప్పటి వరకూ వర్కవుట్ కాలేదు. బట్ ఇన్నేళ్ల తర్వాత సెట్ అయింది అనే టాక్ టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ ఇప్పటి వరకూ కొత్త ప్రాజెక్ట్ ఏదీ చేయలేదు. ఆ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో అనౌన్స్ అయింది. ఆగిపోయింది. నెక్ట్స్ అల్లు అర్జున్ తో సినిమా ఉంది అన్నారు. ఇది ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు. ఇటు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టి ఉన్నాడు. ఈయనా ఇప్పటి వరకూ కొత్త ప్రాజెక్ట్ ఏం అనౌన్స్ చేయలేదు. అది ఇందుకోసమే అనేది లేటెస్ట్ న్యూస్.
త్వరలోనే వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా అనౌన్స్ కాబోతోంది అంటున్నారు. అల్లు అర్జున్ మూవీకి కేటాయించిన టైమ్ కంటే చాలా తక్కువ టైమ్ లోనే వెంకీతో సినిమా కంప్లీట్ చేయబోతున్నారట. త్రివిక్రమ్ దర్శకుడుగా వెంకటేష్ తో సినిమా చేయలేదు కానీ.. తను రాసిన డైలాగ్స్ తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి మూవీస్ తో అద్బుతమైన టైమింగ్ తో అదరగొట్టాడు వెంకటేష్. అందుకే ఈ కాంబో కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఫైనల్ గా ఓకే అయిందంటున్నారు. మరి త్రివిక్రమ్ పంచ్ లను వెంకీ ఏ రేంజ్ టైమింగ్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటాడో వేరే చెప్పక్కర్లేదు కదా..?
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com