Bheemla Nayak: 18 ఏళ్ల త‌ర‌వాత పవన్ కోసం త్రివిక్రమ్..

Bheemla Nayak: 18 ఏళ్ల త‌ర‌వాత పవన్ కోసం త్రివిక్రమ్..
Bheemla Nayak: వాళ్లిద్దరి మధ్య స్నేహం సినిమాతో మొదలైంది.. ఇప్పుడు అంతకంటే ఎక్కువే వాళ్ల మధ్య ఉన్న రిలేషన్.

Bheemla Nayak: వాళ్లిద్దరి మధ్య స్నేహం సినిమాతో మొదలైంది.. ఇప్పుడు అంతకంటే ఎక్కువే వాళ్ల మధ్య ఉన్న రిలేషన్. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో కాకపోయినా పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ కోసం మాటల రచయిత కలానికి పదునుపెట్టి పాట రాశారు.

మాటల రచయిత కలం నుంచి పవర్ ఫుల్ పాటలు కూడా జాలువారుతున్నాయి. ఆయన లోని మరోకోణాన్ని ప్రాణ స్నేహితుడు పవన్ కళ్యాణ్ వెలికి తీశారు. గతంలో రవితేజ నటించిన ఒక రాజు, ఒక రాణి సినిమా కోసం త్రివిక్రమ్ పాటలు రాశారు. మళ్లీ ఇప్పుడు 18 ఏళ్ల తరవాత త్రివిక్రమ్ పాట రాశారు.

భీమ్లా నాయక్ కోసం ' లాలా భీమ్లా' అంటూ తివిక్రమ్ పాట రాయాల్సి వచ్చింది. మొదట వేరే రచయిత ఈ పాట రాస్తే అది పవన్‌కు నచ్చలేదట. దాంతో పవన్ త్రివిక్రమ్‌ని రాయమని కోరడంతో ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. ఓ ఆణిముత్యం లాంటి పాట ఆయన కలం నుంచి జాలు వారింది.. త్రివిక్రమ్ మాట ఎంత పదునుగా ఉంటుందో పాట కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంది..

''పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు.. పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు..'' అంటూ త్రివిక్రమ్ ఈ పాటను రాసిన విధానం పవన్ అభిమానులను కచ్చితంగా ఆకట్టుకుంటుందనడంలో అతిశయోక్తి లేదు.



Tags

Read MoreRead Less
Next Story