సినిమా

ఒక్క సినిమా.. రెండు రీమేక్‌‌‌లు.. త్రివిక్రమ్ హీరోయిన్ ఫేడవుట్..!

ఇప్పుడంటే త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్... ఆయనతో ఒక్క సినిమానైనా చేయాలనీ అనుకునే హీరోలు చాలానే మంది ఉన్నారు. డైరెక్టర్ కంటే ముందు త్రివిక్రమ్ ఓ స్టార్ రైటర్...

ఒక్క సినిమా.. రెండు రీమేక్‌‌‌లు.. త్రివిక్రమ్ హీరోయిన్ ఫేడవుట్..!
X

ఇప్పుడంటే త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్... ఆయనతో ఒక్క సినిమానైనా చేయాలనీ అనుకునే హీరోలు చాలానే మంది ఉన్నారు. డైరెక్టర్ కంటే ముందు త్రివిక్రమ్ ఓ స్టార్ రైటర్... ఇండస్ట్రీలో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ డైలాగ్ రైటర్ త్రివిక్రమే కావడం విశేషం.. అయితే త్రివిక్రమ్ మాటలకి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా చిరునవ్వుతో.. కథారచయితగా ఆయనకిది రెండో సినిమా.. ఇందులోని డైలాగ్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పటికి ఈ సినిమాకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు.

వేణు, షాహీన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకి జి రాంప్రసాద్ దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ కథ-మాటలు అందించారు. ప్రేమ ఓ కీరోల్ పోషించింది. అయితే ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది షాహీన్.. ఆమె అసలు పేరు షాహీన్ ఖాన్.. ఈ సినిమాలో ఆమె సంధ్య అనే పాత్రను పోషించింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఏకంగా మూడు నంది అవార్డులను గెలుచుకుంది.

ఆ తర్వాత ఈ సినిమాకి కన్నడలో రీమేక్ చేశారు. ప్రేమకి సై అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కగా టాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించారు. అశ్వినిదత్ ఈ సినిమాని నిర్మించారు. వి.రవిచంద్రన్ హీరోగా నటించగా ఇందులో కూడా షాహీనే హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత చిరునవ్వుతో సినిమాని యూత్ అనే పేరుతో తమిళ్ లో రీమేక్ చేశారు. అక్కడ విజయ్ హీరోగా నటించాడు. ఇందులో కూడా హీరోయిన్ గా షాహీనే నటించింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మూడు భాషల్లో వచ్చిన ఈ సినిమాకి మణిశర్మనే సంగీతం అందించాడు.

ఇక షాహీన్ ఖాన్ ఈ సినిమాల తర్వాత పెద్దగా సినేమలేమి చేయలేదు. ఆ తరవాత పెళ్లి చేసుకొని సినిమాలకి దూరంగా ఉండిపోయింది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకి టచ్ లో ఉంటోంది.

Next Story

RELATED STORIES