పవన్, రానా సినిమాకి త్రివిక్రమ్!

పవన్, రానా సినిమాకి త్రివిక్రమ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో రానా కలిసి మలయాళ సూపర్‌హిట్‌ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో రానా కలిసి మలయాళ సూపర్‌హిట్‌ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమాని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి కీలకమైన అప్డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్.. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగులను త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తాడని తెలిపారు. ఈ నెల 22 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో కథానాయికలుగా సాయి పల్లవి, ఐశ్వర్యరాజేశ్‌లు ఎంపికైనట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకుడైన తర్వాత వేరే దర్శకుడి చిత్రానికి మాటలు రాయడం ఇది రెండోసారి అని చెప్పాలి.. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తీన్ మార్ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందించారు.

Tags

Next Story