Daku Maharaaj : ట్రోలర్స్ కు పని పెట్టిన డాకూ మహరాజ్ సాంగ్

నందమూరి బాలకృష్ణ మోస్ట అవెయిటెడ్ మూవీ డాకూ మహరాజ్. ఈ నెల 12న విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది. బాబీ కొల్లి దర్శకత్వం చేశాడు. డాకూ మహరాజ్ పై భారీ అంచనాలున్నాయి. వాటిని అందుకోవడంలో ఏ మాత్రం ఫెయిల్ కాము అని మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన డాకూ మహరాజ్ దబిడి దిబిడి సాంగ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. పాట బానే ఉంది. అక్కడక్కడా బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆకట్టుకునేలానే ఉంది. కాకపోతే శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులే కాస్త తేడాగా ఉన్నాయి.
బాలయ్య అదే పనిగా హీరోయిన్, హిప్ అండ్ బ్యాక్ పై బాదుతూ ఉంటాడు. అది కాస్త శృతి మించింది. ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. ఏదో ఒకటీ రెండు సార్లు అంటే ఫర్వాలేదు. పాటలో చాలా చోట్ల అదే కనిపించే సరికి మరింత హైలెట్ అయింది. నిజానికి బాలయ్య ఎనర్జీకి, థమన్ బీట్ కు మంచి స్టెప్పులే వేయగలడు. కానీ హీరోయిన్ ను అలా కొడుతూ ఉండటం అంటే కేవలం దబిడి దిబిడి అనే పదానికి న్యాయం చేయడం కోసం అనుకున్నా.. ఇప్పుడు బాలయ్య అధికార ఎమ్మెల్యే కూడా కావడంతో అవతలి పక్షం వాళ్లు కావాలని కూడా మరింత రాద్ధాంతం చేస్తున్నారు. ఈ స్టెప్స్ పై ఫ్యాన్స్ లో కూడా కొంత అసంతృప్తి కనిపిస్తోందంటున్నారు.అయితే ఈ తరహా విమర్శలకు నిర్మాత నాగవంశీ దగ్గర రెడీమేడ్ ఆన్సర్సే ఉంటాయి. కాబట్టి ఆయనతో పాటు దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ ఏం చెబుతారో చూడాలి.
ఇక బాలయ్య విషయం అంటారా.. ఒక్కసారి కమిట్ అయితే కథలో, ఇతర విషయాల్లో కలగజేసుకోడు. దర్శకుడికి నచ్చితే కొరియోగ్రాఫర్ ఏం చెప్పినా చేసుకుంటూ వెళ్లిపోతాడంతే. కాస్త క్లిష్టమైన మూమెంట్ అయినా సరే.. వచ్చే వరకూ వదలడు. ఇదీ అంతే.. డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ ఛాయిస్ గానే చూడాలి అనేది నిజం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com