Devara : దేవర సాంగ్ పై ట్రోల్స్ మామూలుగా లేవుగా
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పుడే ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. అప్పటికే కొరటాల ఆచార్యతో ఆల్ టైమ్ డిజాస్టర్ ఇచ్చి ఉండటమే కారణం. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాలతో మూవీకి కమిట్ కావడం అప్పట్లో ఎవరికీ నచ్చలేదు కూడా. దీనికి కంటిన్యూషన్ అన్నట్టుగా ఉంది లేటెస్ట్ సాంగ్. నిజానికి దేవర మూవీపై ఇప్పటి వరకూ మినిమం బజ్ కూడా క్రియేట్ కాలేదు. ఓ వైపు ప్యాన్ ఇండియా హీరోగా స్టార్డమ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోన్న ఎన్టీఆర్ కు ఇలాంటి అనుభవం ఎదురు కావడం కొంత ఆశ్చర్యం అనే చెప్పాలి. ఇక అనిరుధ్ సంగీతం అన్నప్పుడు కూడా అనుమానాలే అందర్లోనూ. ఎందుకంటే అతను సంగీతం చేసిన.. అంచనాలున్న తెలుగు సినిమాలన్నీ పోయాయి. కాకపోతే ఈ మధ్య ఆర్ఆర్ తో అదరగొడుతున్నాడనే కారణంతో ఓ ప్లస్ అనుకున్నారు. అలాంటి అంచనాలేం పెట్టుకోవద్దని డైరెక్ట్ గానే చెప్పాడు ఈ సాంగ్ తో.
దేవర పాట కోసం ఈగర్ గా చూస్తోన్న ఫ్యాన్స్ కు కాపీ ట్యూన్ తో షాక్ ఇచ్చాడనే చెప్పాలి. ఇప్పుడీ పాటపై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ హోరెత్తుతున్నాయి. అసలు కొన్నాళ్లుగా ఎన్టీఆర్ పైనే దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఈ సాంగ్ మరీ పేలవంగా ఉండటంతో అటు ఎన్టీఆర్ హైట్ ను కూడా కమెంట్స్ చేస్తూ చాలా బ్యాడ్ కమెంట్స్ పెడుతున్నారు... మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
జాన్వీ కపూర్ తెలుగుకు వస్తోంది అన్నప్పుడు ఓ హైప్ కనిపించింది. ఈ పాటతో అదీ పోయింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అనేదే కనిపించలేదు. ఎలా చూసినా పాట చాలా కృతకంగా ఉందనే కమెంట్సే వస్తున్నాయి. డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఎన్టీఆర్ స్టాండర్డ్స్ లో లేవు. ఓ మినీ హీరో పాటలా కనిపిస్తోందీ సాంగ్. మొత్తంగా సాంగ్ రిలీజ్ అయిన దగ్గర్నుంచీ కాపీ ట్యూన్ అంటూనే పాట మొత్తంపై ఓ రేంజ్ ట్రోల్స్ అండ్ మీమ్స్ తో సోషల్ మీడియా అంతా హీటెక్కిపోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com