Akhanda 2 : సినిమా అంతా ఇలాగే ఉంటే కష్టమే అఖండా..

రోరింగ్ స్టార్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఫుల్ రైజింగ్ లో ఉన్నాడు. వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ 2 :తాండవం చిత్రంతో రాబోతున్నాడు. దసరా స్పెషల్ గా సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అఖండకు సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ మూవీ టీజర్ ను ఈ నెల 10న బాలయ్య బర్త్ డే స్పెషల్ గా విడుదల చేశారు. ఈ కాంబోలో సినిమా అంటే ఏ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయో అదే రేంజ్ లో టీజర్ ఉండేలా చూసుకున్నారు. బట్ బోయపాటి మార్క్ లాంటి షాట్ గా త్రిశూలం విజువల్ కనిపిస్తోంది. నిజానికి ఆ షాట్ పై చాలా విమర్శలు వచ్చేవే. కానీ బాలయ్య బర్త్ డే స్పెషల్ గా వచ్చిన టీజర్ కాబట్టి చాలామంది కామ్ గా ఉండిపోయారు. అలాంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలు బోయపాటికే వస్తాయి. అంతకు ముందు స్కంద సినిమాలో కూడా రామ్ పోతినేని ఇమేజ్ ను మించి చేయించిన యాక్షన్ పార్ట్స్ అభాసుపాలయ్యాయి. తన హీరోలు పవర్ ఫుల్ ఉండాలని ఏ దర్శకుడైనా కోరుకోవడంలో తప్పు లేదు. కానీ మరీ ఇలా నేల విడిచి సాము చేయడం లాంటి షాట్స్ అంటే ఇప్పటి ఆడియన్స్ అంత ఈజీగా తీసుకోవడానికి లేరు. త్రిశూలంతో పాటు అన్నేసి గన్నులు పట్టుకుని వచ్చిన వారిని ఒక్కడుగా మడతపెట్టి గాలిలోకి ఎగరేయడం ఎంత మాస్ హీరో అయినా అంత సులువుగా తీసుకోలేరు.
ఇలాంటి షాట్స్, యాక్షన్ సీక్వెన్స్ విషయంలో బాలయ్యను ఏం అనలేం. ఎందుకంటే ఒక్కసారి కథ నచ్చి కమిట్ అయితే ఆయన చిన్న పిల్లాడిలా దర్శకుడు ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్లిపోతాడు. ఏదైనా దర్శకుడే ఫైనల్ బలంగా నమ్ముతాడు. అందుకే ఆయన కెరీర్ లో చాలా సీన్స్ ట్రోలింగ్ కు గురయ్యాయి. ఈ ఏజ్ లో కూడా అలాంటి ట్రోలింగ్స్ అవసరం లేకుండానే ఇప్పుడు వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ కొట్టి ఉన్నాడు. ఇలాంటి హ్యాపీ టైమ్ లో, డబుల్ హ్యాట్రిక్ కు దగ్గరవుతోన్న టైమ్ లో ట్రోలింగ్ కంటెంట్ అవసరం లేదేమో. ఇప్పటికైనా ఇలాంటివి తగ్గించి బోయపాటి తన ఆవేశాన్ని కంట్రోల్ లో ఉంచుకుని ఈ తరహా త్రిశూలాలను కాస్త తగ్గిస్తే మంచిదేమో అని చాలామంది అనుకుంటున్నారు. లేదూ సినిమాలో అన్నీ అలాగే ఉంటే ఈ సారి ట్రోల్స్ తో పాటు విమర్శలూ తప్పవేమో అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com