Tirupati Srinivasa Rao : టీఎస్ఆర్ బ్యానర్ నుంచి థర్డ్ మూవీ స్టార్ట్

టీఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి హరికృష్ణ, భవ్య శ్రీ జంటగా కొత్త సినిమా స్టార్ట్ అయింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండిన ఈ కథ హార్ట్ టచింగ్ స్టోరీతో రూపొందబోతోంది. తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తుండగా, ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
విపిన్ వి రాజ్ సినిమాటోగ్రఫీ దృశ్యాలు, గౌతమ్ రవిరామ్ సంగీతం, విజయ్ కందుకూరి సంభాషణలు పాత్రల భావాలను సహజంగా ఆవిష్కరించేలా ఉంటాయట. ఈ సినిమా కేవలం ప్రేమకథ మాత్రమే కాక, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు, వారి సవాళ్లు, మరియు విజయాలను కూడా హృదయానికి హత్తుకునేలా చిత్రికరించబడుతుంది. దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి కథనంలో సమతుల్యతను పాటిస్తూ, ప్రేమ మరియు కుటుంబ జోనర్‌లను సమర్థవంతంగా తెరకెక్కిస్తున్నారు.
దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి మాట్లాడుతూ : ‘TSR మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమా ప్రేమికులకు మరో విజయవంతమైన చిత్రాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు. గతంలో ఎన్నడూ చూడని ఒక వైవిధ్యమైన ప్రేమ కథని చూపించబోతున్నారు. గతంలో ఈ బ్యానర్ లో తికమక తాండ, కోబలి వంటి వైవిధ్యమైన సినిమాలు వచ్చాయి. ఎంతగానో ఆకట్టుకున్నాయి. కోబలి సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బాగా ట్రెండ్ అయ్యింది. అలాంటిది ఈ బ్యానర్ లో ఇప్పుడు మరో అదిరిపోయే సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ప్రొడ్యూసర్ తిరుపతి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ : ఈ సినిమా కంటెంట్ బాగా నచ్చిందని అన్నారు. కొత్త జోనర్ లో వైవిధ్యమైన లొకేషన్ లలో ఈ సినిమాని తెరకెక్కించి ఆడియన్స్ కి ఒక కొత్త అనుభూతి ఇస్తాం అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com