సినిమా

Gangavva: తన గ్రామానికి మళ్లీ బస్సు సర్వీసు వచ్చేలా చేసిన గంగవ్వ..

Gangavva: లంబాడిపల్లి గ్రామస్థులతో కలిసి గంగవ్వ జగిత్యాల ఆర్‌టీసీ డిపో అధికారులను కలిసింది.

Gangavva: తన గ్రామానికి మళ్లీ బస్సు సర్వీసు వచ్చేలా చేసిన గంగవ్వ..
X

Gangavva: ఈరోజుల్లో పాపులర్ అవ్వడానికి వయసుతో సంబంధం లేదు. ఎవరైనా నచ్చితే సోషల్ మీడియానే వారిని పాపులర్ చేసే బాధ్యతను తీసుకుంటోంది. అలా ఫేమస్ అయినవారిలో ఒకరే గంగవ్వ. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన గంగవ్వ.. బిగ్ బాస్ షోలోకి కూడా వెళ్లి వచ్చింది. ఇక తాజాగా గంగవ్వ చొరవ వల్ల వాళ్ల ఊరికి బస్సు సదుపాయం ఏర్పడింది.

తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామంలో జీవిస్తోంది గంగవ్వ. అంతకు ముందు లంబాడిపల్లికి బస్సు సదుపాయం ఉండేది. కానీ కరోనా తర్వాత ఆ సదుపాయాన్ని ఆపేసింది ప్రభుత్వం. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. బస్సు సదుపాయం కల్పించడానికి తమకు తోడుగా నిలవాలని గంగవ్వను సాయం కోరారు గ్రామస్థులు.

లంబాడిపల్లి గ్రామస్థులతో కలిసి గంగవ్వ జగిత్యాల ఆర్‌టీసీ డిపో అధికారులను కలిసింది. దీంతో వారు ఆ గ్రామానికి మళ్లీ బస్సు సర్వీసును ప్రారంభించారు. తిరిగి బస్సు సర్వీసు ప్రారంభం కావడంతో లంబాడిపల్లి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గంగవ్వ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES