Raviteja : మాస్ జాతర సాంగ్.. తులసి కోటలో గంజాయి ఫ్లేవర్

మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’. శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. రీసెంట్ గా వచ్చిన ప్రోమో చూస్తే.. ఇడియట్ లోని చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే పాటలోని ట్యూన్ ను వాడుతున్నట్టుగా చెప్పారు. వాడారు కానీ.. కేవలం ఒకే ట్యూన్ ను తీసుకున్నారు. మిగతా అంతా భీమ్స్ సిసిరోలియోనే చేశాడు. అయితే పాట మాత్రం విచిత్రంగా ఉంది. తన లవర్ ను తిట్టుకుంటూ హీరో పాడుకునే పాట ఇది. పాటలోని తిట్లు కూడా విచిత్రంగా ఉండేలా సాహిత్యం రాశాడు భాస్కర భట్ల రవికుమార్. లవర్ మోసం చేసిన సందర్భంలో వచ్చే సాంగ్ లా ఉంది.
‘తూ మేరా లవ్వర్ లవ్వర్ లవ్వరూ మే తుజ్ దియా ఫ్లవర్.. పెట్టావే చెవిలో కాలి ఫ్లవ్వరు’ అంటూ మొదలైన పాట... ‘నీలాగా నచ్చలేదే గిచ్చలేదే ఎవ్వరు.. చొక్కాలే చింపుకోవాలే నాకులాగే అందరు.. నువ్వేమో తులసి కోటాలోన గాంజా ఫ్లేవరు.. మీ బాబు నిన్ను మించి ఇంకా పెద్ద లోఫరూ..పైకేమో స్కాచ్ బాటిల్ లాగా నువ్వు సూపరూ.. నీ మైండు చూడబోతే చీపు లిక్కరూ.. నా గొంతు కోస్తివే దొంగ టీచరూ..’అనే పల్లవితో మాంచి టీజింగ్ సాంగ్ లా ఉంది.
ఈ తరహా పాటలు రవితేజ ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. మరి ఆమె చేసిన మోసం ఏంటీ.. ఇతను పోయిన నష్టం ఏంటీ అనేది సినిమాలో తెలుస్తుంది కానీ.. ఫ్యాన్స్ కు నచ్చేలా ఇమేజ్ కు నచ్చేలా మంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ తో వచ్చింది టీమ్.
విశేషం ఏంటంటే.. ఈ పాటను ఏఐ వాయిస్ ద్వారా దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి వాయిస్ లో రికార్డ్ చేశారు. కొన్ని వోకల్స్ ను మాత్రం భీమ్స్ అందించాడు. ఆ ఏఐ వాయిస్ పర్ఫెక్ట్ గా ఉండటం బావుంది. చక్రి ఫ్యాన్స్ కూడా మరోసారి తమ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ ను గుర్తుకు చేసుకునేలా ఉంది. సితార, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నాడు. మే లేదా జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయి అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com