Hend Sabry : WFP గుడ్‌విల్ అంబాసిడర్‌ పదవికి ట్యునీషియా నటి రాజీనామా

Hend Sabry : WFP గుడ్‌విల్ అంబాసిడర్‌ పదవికి ట్యునీషియా నటి రాజీనామా
ఐక్యరాజ్యసమితి (UN) వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP)కి గుడ్‌విల్ అంబాసిడర్‌గా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ట్యునీషియా నటి హెండ్ సబ్రీ

ట్యునీషియా నటి హెండ్ సబ్రీ దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఐక్యరాజ్యసమితి (UN) వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP)కి గుడ్‌విల్ అంబాసిడర్‌గా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముట్టడి చేయబడిన గాజా స్ట్రిప్ నివాసితులపై ఆకలి అనే ఆయుధాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె ఈ ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సబ్రీ.. “నేను చాలా బాధతో ఇది రాస్తున్నాను. ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమానికి గుడ్‌విల్ అంబాసిడర్‌గా నా పాత్ర నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఈ పాత్రను నేను ఎన్నో ఏళ్ళుగా ఎంతో ఆదరించి పోషించాను" అని పోస్ట్ లో రాసుకొచ్చింది. "నేను చాలా నేర్చుకున్నాను. ఈ ప్రయాణంలో నేను మీ అందరితో కలిసి చాలా ఏడ్చాను. ఇది నా హృదయంలో ఎల్లప్పుడూ నిలిచే ఉంటుంది" అని అన్నారు.

13 సంవత్సరాల క్రితం, తాను యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే బిగ్ ఫ్యామిలీలో భాగమైందని సబ్రీ చెప్పారు. ఇది గొప్ప మిషన్‌లో భాగమని, తాను దాని గురించి గర్వపడుతున్నాని చెప్పారు. గత కొన్ని వారాల నుంచి ప్రపంచ ఆహార కార్యక్రమంలో నా అంకితభావం కలిగిన సహచరులు పిల్లలు, తల్లులు, తండ్రుల పట్ల వారు ఎప్పటిలాగానే తమ కర్తవ్యాన్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించలేక నిస్సహాయంగా భావించే అనుభవాలను నేను చూశాను, పంచుకున్నాను" అని ఆమె చెప్పారు.

ట్యునీషియాకు చెందిన ఆమె అణిచివేత వార్ మెషీన్ కారణంగా పౌరులకు సహాయం చేయడంలో తన అసమర్థతను వ్యక్తం చేసింది. గాజాలో మానవతావాద కాల్పుల విరమణ కోసం, యుద్ధ ఆయుధంగా ఆకలి చావును నివారించడం కోసం ప్రపంచ ఆహార కార్యక్రమం అత్యున్నత స్థాయిలో తన ఆందోళనలను వినిపించేందుకు చేసిన ప్రయత్నాలను ఆమె నొక్కిచెప్పారు. "ప్రపంచ ఆహార కార్యక్రమం - కేవలం మూడు సంవత్సరాల క్రితం నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంది. UN రిజల్యూషన్ 2417 లో చురుకుగా పాల్గొని, ఆకలిని యుద్ధ పద్ధతిగా ఉపయోగించడాన్ని ఖండించింది. దాని స్వరాన్ని శక్తివంతంగా ఉపయోగిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇది అత్యవసర పరిస్థితులు, పలు మానవతా సంక్షోభాలను మీరింది ” అని ఆమె వివరించారు.

"అయితే, గత 46 రోజులుగా గాజాలో రెండు మిలియన్లకు పైగా పౌరులకు వ్యతిరేకంగా ఆకలి, దిగ్బంధనాలను యుద్ధ ఆయుధాలుగా ఉపయోగించారు" అని సబ్రీ చెప్పారు. "ఈ కారణంగా, నేను నా రాజీనామాను ప్రకటిస్తున్నాను. ప్రపంచ ఆహార కార్యక్రమంలో నా సహచరులందరికీ భద్రత, శాంతిని కోరుకుంటున్నాను" అని ఆమె జతచేసింది. సబ్రీ తన మానవతా, సామాజిక పాత్రలను వివిధ మార్గాల్లో కొనసాగిస్తానని ముగించారు. అక్టోబరు 7న గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, సబ్రీ తన సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా పాలస్తీనాకు చురుకుగా మద్దతు ఇస్తోంది.

Next Story