Siddhaanth Vir Surryavanshi: జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ బుల్లి తెర నటుడు మృతి..

Siddhaanth Vir Surryavanshi: ఆరోగ్యానికి వ్యాయామం మంచిది అని డాక్టర్లు చెబుతుంటారు. కానీ ఏదైనా అతిగా చేస్తే అది అనర్థానికే దారి తీస్తుంది. అది ఆహారమైనా, వ్యాయామమైనా. ఈ మధ్య జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నవారు ఎక్కువవుతున్నారు.
మంచి శరీరసౌష్టవం కోసం, ఆరోగ్యం కోసం సెలబ్రెటీలు జిమ్‌ను ఎక్కువగా ఎంచుకుంటారు. కానీ ఒక్కోసారి అదే తమ ప్రాణాలను హరిస్తోంది. ఎంతో భవిష్యత్ ఉన్నవారు చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ప్రముఖ బుల్లి తెర నటుడు ఉదయం 11 జిమ్‌లో వ్యాయామం చేస్తూ మరణించాడు.
46ఏళ్ల సిద్ధాంత్ వీర్ సూర్యవంశీకి భార్య అలెసియా రౌత్ మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు.మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన సిద్ధాంత్.. కుసుమ్, కసౌతి జిందగీ కే, సుఫియానా ఇష్క్ మేరా , జిద్ది దిల్ మానే నా, వారిస్ వంటి బుల్లితెర సీరియల్స్‌లో నటించి ప్రేక్షకాదరణను చూరగొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com