Naveena : బుల్లితెర నటి గృహప్రవేశం... చీరకే లక్ష..!

Naveena :  బుల్లితెర నటి గృహప్రవేశం... చీరకే లక్ష..!
Naveena : బుల్లితెర నటి నవీన సొంతింటి కల నిజమైంది. తాజాగా గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Naveena : బుల్లితెర నటి నవీన సొంతింటి కల నిజమైంది. తాజాగా గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో చాలా విషయాలను వెల్లడించింది నవీన. ఈ గృహప్రవేశం కోసం మొదటిసారిగా లక్ష రూపాయలు పెట్టి కొన్న చీరను కట్టుకుని తెగ మురిసిపోయింది. ఎప్పటినుంచో జీవితంలో ఒక్కసారైనా లక్ష రూపాయల చీర కట్టుకోవాలనుకున్న తన కోరిక ఈ సందర్భంగా తీరిందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా బంగారు ఆభరణాలు, కడియాలు, షార్ట్‌ అండ్‌ లాంగ్‌ నెక్లెస్‌లు సైతం చూపించింది. తన ఇంటి నిర్మాణం కోసం పనిచేసిన మేస్త్రీ దంపతులకు కొత్త బట్టలు పెట్టి సత్కరించింది. గృహప్రవేశం తర్వాత నవీన దంపతుల కుమారులైన ఇద్దరికి ధోతీ ఫంక్షన్‌ కూడా నిర్వహించారు. కాగా పలు సీరియల్స్ లలో నటించి నవీన మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

Tags

Next Story