Actress Sreevani: నటి శ్రీవాణికి అరుదైన వ్యాధి.. అస్సలు మాట్లాడకూడదన్న డాక్టర్

Actress Sreevani: ఆమె సినిమాలు, సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. గల గలా మాట్లాడుతూ అత్తగారు, అమ్మ పాత్రల్లో ఒదిగిపోయేది.ఉన్నట్టుండి ఒకరోజు ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. గొంతు సరిగా రాకపోయేసరికి జలుబు అయి ఉంటుందని సరిపుచ్చుకుంది. కానీ రోజు రోజుకి ఏదో తేడా.. గొంతు పూర్తిగా పోయింది. డాక్టర్ దగ్గరకు వెళ్తే నెల రోజుల వరకు అస్సులు మాట్లాడకూడదని చెప్పారు.
కొంచె మాట్లాడినా ఆమె గొంతు ఎప్పటికీ పోతుందని తెలిపారు. ఈ విషయాన్ని ఆమె యూట్యూబ్ ఛానెల్‌లో భర్త ఆమె అభిమానులకు వివరించారు. శ్రీవాణి చూపించుకుంటున్న హాస్పిటల్ ఫోటోలు, డాక్టర్ రిపోర్టులు అన్నీ వీడియోలో చూపించారు. నెలరోజుల తర్వాత తన భార్య నార్మల్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు శ్రీవాణి భర్త. తల్లి పరిస్థితిని వివరించారు కూతురికి. దాంతో కూతురు అమ్మని హగ్ చేసుకుని బాధపడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com