NTR Devara 1 : ఒడియమ్మ బడవ.. ఇదేం ట్విస్టయ్యా దావూదీ

NTR Devara 1 :  ఒడియమ్మ బడవ.. ఇదేం ట్విస్టయ్యా దావూదీ

కొన్ని పాటలు చూస్తే ఊపొస్తుంది. కొన్ని పాటలు చూస్తే నీరసం వస్తుంది. ఇంకొన్ని ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ కావు. ఈ మూడు ఫీలింగ్స్ ను ఇచ్చిన సాంగ్ దేవర నుంచి విడుదలైన థర్డ్ సాంగ్ దావూదీ. ఎన్టీఆర్ స్టెప్పులు ఇరగదీస్తాడని ఊరించిన టీమ్ చివరికి సింపుల్ స్టెప్స్ తో సరిపెట్టింది. అది బాగా డిజప్పాయింట్ చేసింది. జాన్వీ కపూర్ తో ఎన్టీఆర్ స్టెప్పులను నెక్ట్స్ లెవల్ లో ఎక్స్ పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. కేవలం 2 నిమిషాల 12 సెకన్ల పాటు మాత్రమే ఉందీ పాట. మిగతాది తర్వాత విడుదల చేస్తారని కొందరు అమాయక అభిమానులు అనుకుంటున్నారు. వాళ్లకే కాక ఈ సాంగ్ నచ్చినవాళ్లకు కూడా ఓ బ్యాడ్ న్యూస్.

దావూదీ అనే పాట సినిమాలో సీన్ ప్రకారం ఉండదట. చివర్లో టైటిల్స్ పడుతున్నప్పుడు ఈ సాంగ్ వస్తుందట. అంటే దావూదీ అనే పాటకు పెద్దగా ప్రాధాన్యం లేదు అని అర్థం అవుతోంది కదా. ఇలాంటి సాంగ్స్ సినిమా మధ్యలో వస్తే ఫ్యాన్స్ విజిల్స్, పేపర్స్ విసరడం వంటి విషయలతో హంగామా చేస్తారు. బట్ అలాంటి హంగామాకు ఆస్కారం లేకుండా రోలింగ్ టైటిల్స్ టైమ్ లో చివర్లో వస్తుందన్నమాట. ఆ మధ్య విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ద ఫ్యామిలీ మేన్ లో ఓ వెడ్డింగ్ సాంగ్ తో తెగ ప్రమోషన్స్ చేశారు. బట్ ఆ సాంగ్ కూడా ఇలాగే రోలింగ్ టైటిల్స్ లో వేసి ఫ్యాన్స్ ను చీట్ చేశారు.

Tags

Next Story