Jani Master : నా భర్తను ట్రాప్ చేసింది .. జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్

Jani Master : నా భర్తను ట్రాప్ చేసింది .. జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్
X

జానీమాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జానీ భార్య సుమలత లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఇండస్ట్రీలో ఎదగడానికి కొరియోగ్రాఫర్గా పని చేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసిందని.. ఐదేండ్ల పాటు నాకు నరకం చూపించిందని పేర్కొంది. తన భర్త ఇంటికి రాకుండా అడ్డుకునేదని తెలిపింది. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేదని చెప్పింది. 'నాకు అమ్మ నాన్నలు వద్దు.. నువ్వు పెళ్లి చేసుకో చాలు' అని జానీ పై ఒత్తిడి తెచ్చిందని తెలిపింది. ఈ వ్యవహారం తాను ఆత్మ హత్యకు యత్నించే దాకా వెళ్లిందని వెల్లడించింది. చేసేదేం లేక తాను ఆ అమ్మాయి ఇంటికి వెళ్లానని, జానీని నువ్వు ఇష్టపడితే ఆయన జీవిత నుంచి తాను వె ళ్లిపోతానని చెప్పానని సుమలత వివరించింది. బాధితురా లు మాత్రం 'జానీ నాకు అన్నయ్య లాంటివాడు మీరు నాకు వదిన' అంటూ నమ్మించిందని తెలిపింది.

Tags

Next Story