Sukumar : సుకుమార్ మ్యాజిక్ కు 20 యేళ్లు..

క్రియేటివ్ జీనియస్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్. రాజమౌళి లాంటి దర్శకుడే సుకుమార్ ను చూస్తే చాలా భయం వేస్తుంది. అంత గొప్ప దర్శకుడు అన్నాడు అంటే అతని కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ మూవీనే సంచలనం. ఇప్పుడు చేస్తోన్న సినిమాలూ సంచలనమే. మొదటి టైర్ టూ హీరోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా మెల్లగా రూట్ మార్చాడు. టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్ గా మారిపోయాడు.
ఒకప్పుడు హీరోలు లవ్ లో ఫెయిల్ అయితే ఆ కథలన్నీ విషాదంగానే కనిపించాయి. శాడ్ స్టోరీలుగా సాగుతూ.. ఆయన గడ్డం పెంచుకుని మందు బాటిల్ చేత పట్టుకుని అదో మూడ్ లో కనిపించేవాడు. బట్ సుకుమార్ ఒన్ సైడ్ లవ్ స్టోరీని ఆల్ టైమ్ ఫేవరెట్ అనిపించేంత మెమరబుల్ చేశాడు. ఆర్యలో ఒన్ సైడ్ లవ్ ను మోస్ట్ ఎంటర్టైనింగ్ గా చెప్పి.. ప్రేమించే మనమే గొప్ప అనిపించాడు. లెక్కల మాస్టార్ కావడంతో ఆయన మూవీస్ అన్నీ కాలిక్యులేటెడ్ గా ఉంటాయి. 100 పర్సెంట్ లవ్, ఆర్య 2, ఒన్ నేనొక్కడినే వంటి సినిమాలు సుకుమార్ లో మరో కోణాన్ని ఆవిష్కరిస్తాయి. ఒన్ నేనొక్కడినే బ్రిలియన్సీ ప్రేక్షకులకు అర్థం కాలేదు. కానీ అప్పటి నుంచే తన రూట్ మార్చాడు. ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, రామ్ చరణ్ తో రంగస్థలం. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. రంగస్థలం లాంటి మూవీని అతను హ్యాండిల్ చేసిన విధానానికి అంతా ఫిదా అయ్యారు.
ఇక నెగెటివ్ హీరోయిజంతో చేసిన పుష్ప 1 ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్ అయింది. ఇప్పుడు దీని సీక్వెల్ కు రిలీజ్ కు ముందే 1000 కోట్ల బిజినెస్ చేసి రాజమౌళి భయాన్ని, సుకుమార్ పై నమ్మకాన్ని నిజం చేసింది. ఈ మూవీతో అతను కూడా ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. సో.. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే సుకుమార్ అనే క్రియేటివ్ జీనియస్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 20 యేళ్లైంది. సో.. మరో ఇరవైయేళ్ల పాటు ఇండస్ట్రీలో కెరీర్ సాగించేంత సత్తా ఉన్న సుకుమార్ పుష్ప 2కు ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com