Guntur Kaaram : మరో వివాదంలో 'గుంటూరు కారం'.. ప్రాజెక్ట్ నుంచి మరో ఇద్దరు ఔట్

Guntur Kaaram : మరో వివాదంలో గుంటూరు కారం.. ప్రాజెక్ట్ నుంచి మరో ఇద్దరు ఔట్
X
'గుంటూరు' కారం నుంచి తప్పుకున్న మరో ఇద్దరు సిబ్బంది

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. ఇది భావోద్వేగాలు, కుటుంబ అంశాలతో కూడిన యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు ప్రఖ్యాత చిత్రనిర్మాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రాన్ని జనవరి 12, 2023న ప్రేక్షకుల ముందురు రానుంది. ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుటున్న ఈ మూవీ నుంచి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. మరో ఇద్దరు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని సోషల్ మీడియాలో ఒక పుకారు ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే, డీఓపీ పీఎస్ వినోద్ పలు కారణంగా సినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా వచ్చిన ఈ గాసిప్‌కు సంబంధించి, ప్రొడక్షన్ టీమ్ ఇంకా అధికారిక ప్రకటన చేయవలసి ఉంది.

ఇక ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోన్న పూజా హెగ్డే తప్పుకోగా.. ఆమె స్థానంలో శ్రీలీల చేస్తోంది. ఆ తర్వాత ఈ సినిమా నుంచి కెమెరామెన్ పీఎస్ వినోద్ కూడా తప్పుకున్నారట. కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. పిఎస్ వినోద్ గతంలో త్రివిక్రమ్ అల వైకుంఠపురములో, అరవింద సమేత వీర రాఘవ చిత్రాలకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. పీఎస్ వినోద్ స్థానంలో రవి కె చంద్రన్ చేరినట్లు తెలుస్తోంది. I

ఇక గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. వీరితో పాటు ఈ సినిమాలో రామకృష్ణ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ కు సంబంధించిన పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ రెండు పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీతో వెకేషన్ టూర్ లో ఉన్నాడు. అక్కడే బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. దీంతో త్వరలోనే గుంటూరు కారం కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త షెడ్యూల్ ఈనెల 16 నుంచి షురూ కానుందని తెలుస్తోంది.


Tags

Next Story