Yevade Subrahmanyam : టాలీవుడ్ లో మరో రెండు రీ రిలీజ్ లు

కొత్తగా రిలీజ్ అవుతోన్న సినిమాలకు రీ రిలీజ్ లు తలనొప్పిగా మారాయి అనేది ఈ మధ్య కాస్త ఎక్కువగా వినిపిస్తోంది. మెయిన్ మూవీస్ కంటే ఈ రీ రిలీజ్ లకే ఆడియన్స్ ఎక్కువగా మొగ్గు చూపిస్తుండటం కొత్త సినిమాలకు మైనస్ అవుతుంది. ఏదో సందర్భాలను బట్టి అంటే ఓకే కానీ.. అదే పనిగా పొలోమని వచ్చేస్తుండటం మాత్రం కాస్త ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి. గత వాలెంటైన్స్ డే కు వచ్చిన మూవీస్ లో ఆరెంజ్ డామినేషన్ క్లియర్ గా కనిపించింది. మెయిన్ మూవీస్ కు పెద్ద టాక్ లేదు కాబట్టి ఓకే. అయితే మార్చిలో మరో రెండు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. మార్చి 7న వెంకటేష్, మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టును మళ్లీ విడుదల చేస్తున్నారు.
శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ మూవీకి రిలీజ్ టైమ్ లో బిగ్ బ్లాక్ బస్టర్ అనే టాక్ రాలేదు. కానీ టివిల్లో చూస్తున్నప్పుడు మాత్రం బలే ఉందే అనుకున్నారు. అలా కల్ట్ స్టేటస్ తెచ్చుకుందీ మూవీ. సమంత, ప్రకాష్ రాజ్, జయసుధ, అంజలి, రావు రమేష్ ల పాత్రలను బాగా ఎంగేజ్ చేశాయీ చిత్రంలో. అన్నదమ్ముల బంధం కూడా బాగా ఎలివేట్ అయింది.
ఇక మార్చి 21న నేచురల్ స్టార్ నాని, రీతూవర్మ, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ నటించిన 'ఎవడే సుబ్రహ్మణ్యం'ను మళ్లీ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కల్కితో ప్యాన్ ఇండియా డైరెక్టర అయిన నాగ్ అశ్విన్ కు దర్శకుడుగా ఫస్ట్ మూవీ ఇదే. ఈ చిత్రాన్ని కల్ట్ అన్నారు ఆడియన్స్. ఈ రెండు సినిమాల రీ రిలీజ్ ల వల్ల ఈ సారి పెద్దగా ఎవరికీ ఇబ్బంది లేదు. ఎందుకంటే మార్చి 7న భైరవం రిలీజ్ డేట్ వేశారు కానీ ఇంకా కన్ఫార్మ్ చేయలేదు. 21న ప్రభావితం చేయగలిన సినిమాలేం లేవు. సో.. ఈ రెండు సినిమాలూ ఆ గ్యాప్ ను ఫిల్ చేసేవే అని చెప్పొచ్చు. అంటే ఎవరికీ తలనొప్పి ఉండదన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com