Balakrishna : బాలయ్య అన్ స్టాపబుల్ షో కి ఆ ఇద్దరూ వస్తున్నారు
నందమూరి బాలకృష్ణ ఇమేజ్ ను కొత్తగా చూపించిన షో అన్ స్టాపబుల్. తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమ్ అయిన ఈ షోకు హోస్ట్ గా బాలయ్య అదరగొట్టాడు. ఆయన హోస్ట్ గా సెట అవుతాడా అనుకున్నవాళ్ల అనుమానాలన్నీ పటాపంచెలు చేస్తూ.. అన్ని ఎపిసోడ్స్ ను ఆద్యంతం రక్తి కట్టిస్తూ తనకే సొంతమైన శైలిలో ఈ షోను బ్లాక్ బస్టర్ చేశాడు. ఇప్పటి వరకూ రెండు సీజన్స్ పూర్తయ్యాయి. ఈ దసరా నుంచి థర్డ్ సీజన్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఈ షోకు సంబంధించి ఇద్దరు గెస్ట్ ల గురించి కీలకమై అప్డేట్ వచ్చింది. అది కూడా నిర్మాతల మండలి నుంచి ప్రసన్న కుమార్ చెప్పడం విశేషం.
దసరా నుంచి స్టీమ్ అయ్యే అన్ స్టాపబుల్ ను అంతా కోరుకుంటున్నట్టుగానే మెగాస్టార్ చిరంజీవితో స్టార్ట్ చేయబోతున్నారు. ఆహా ఓనర్ అల్లు అరవింద్ అయినా ఇప్పటి వరకూ చిరంజీవిని షోకు తీసుకు రాకపోవంపై చాలా అనుమానాలు వ్యక్తం చేశారు చాలామంది. అవన్నీ తెంచేస్తూ ఆయనతోనే థర్డ్ సీజన్ మొదలుపెడతారట. ఈ షోలో బాలయ్య, చిరంజీవి కలిసి ఎన్నో మెమరీస్ ను పంచుకుంటారని వేరే చెప్పక్కర్లేదు. అలాగే విశ్వంభర మూవీ ప్రమోషన్స్ కూడా కనిపిస్తాయి.
ఇక కొన్నేళ్లుగా ఇండస్ట్రలో నందమూరి, అక్కినేని హీరోల మధ్య విభేదాలున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ, నాగార్జునకు అస్సలు పడదు అనే టాక్ ఉంది.. అది నిజమే అంటారు వారి సన్నిహితులు. ఇక వీటికి ఫుల్ స్టాప్ పెడుతూ నాగార్జున కూడ ఈ షోకు గెస్ట్ గా రాబోతున్నాడట. అయితే ఇది పూర్తిగా నాగ్, ధనుష్ కలిసి శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేస్తోన్న కుబేర సినిమా ప్రమోషన్ లా ఉంటుందట. కాకపోతే ముందుగా నాగ్ తో ఇంటరాక్ట్ అయ్యి.. ఆ తర్వాత శేఖర్ కమ్ముల ఎంటర్ అవుతాడనే టాక్ ఉంది. మొత్తంగా ఇన్ని రోజులుగా అంటే రెండు సీజన్స్ నుంచి ప్రశ్నార్థకంగా ఉండి.. అనేక డౌట్స్ ను క్రియేట్ చేసిన మెగాస్టార్ తో పాటు నాగార్జున కూడా అన్ స్టాపబుల్ కు గెస్ట్ లుగా రాబోతున్నారన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com