Game Changer : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ అపశృతి

పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మరవక ముందే మరో దుర్ఘటన జరిగింది. రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అయిన ఇద్దరు అభిమానులు దుర్మరణం పాలయ్యారు.కాకినాడ జిల్లాలోని గైగోలుపాడు గ్రామానికి చెందిన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ అనే యువకులు రాజమండ్రిలోని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యి అదే రోజు ఇంటికి తిరిగి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ మరణించారు.
ఈ విషయం తెలసుకున్న నిర్మాత దిల్ రాజు వెంటనే రియాక్ట్ అయ్యాడు. మరణించిన ఇద్దరు యువకుల కుటుంబాలకు చెరో 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..
‘‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేం సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతుగా వారి కుటుంబాలకు చెరో రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను’’ అన్నారు.
దిల్ రాజుతో పాటు హీరో రామ్ చరణ్ కూడా స్పందించి తనవంతుగా సాయం చేస్తే ఆ కుటుంబాలకు కాస్త అండగా నిలిచినట్టవుతుంది.కాకపోతే ప్రస్తుతం ఆయన ప్రమోషన్స్ కోసం చాలా బిజీగా ఉన్నాడు. సినిమా రిలీజ్ తర్వాత ఏదైనా సాయం చేస్తాడేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com