Uday Kiran : మనసంతా నువ్వే మళ్లీ వస్తోందా..?

ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మనసంతా నువ్వేని ఎంతమంది గుర్తు పెట్టుకున్నారు.. అంటే అసలు మర్చిపోతే కదా అనుకుంటారేమో. నిజం.. ఇదో క్లాసిక్ లవ్ స్టోరీలాగా మిగిలిపోయింది. ఉదయ్ కి హ్యాట్రిక్ అందించిన సినిమా ఇది. అంతకు ముందు చిత్రం తర్వాత నువ్వు నేనుతో చాలా పెద్ద విజయాలు అందుకున్నాడు. ఆ రెండిటికీ మించి అనేలా ఉంటుంది మనసంతా నువ్వే. ఈ మూవీని ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత గొప్ప లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిలిచిపోతుందీ మూవీ. ఉదయ్ కిరణ్ హీరోగా రీమా సేన్ హీరోయిన్ గా నటించింది. తనూరాయ్, సునిల్, తనికెళ్ల భరణి, చంద్ర మోహన్, సుధ, పరుచూరి వెంకటేశ్వరరావు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ 19 అక్టోబర్ 2001లో విడుదలైంది. అలాంటి మూవీని మళ్లీ విడుదల చేయాలనుకోవడం గొప్ప విషయం.
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి విఎన్ ఆదిత్య దర్శకుడు. ఆర్పీ పట్నాయక్ అందించిన సంగీతం ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. మళ్లీ ఈ చిత్రాన్ని 2026 వేలెంటైన్స్ సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఉదయ్ కిరణ్ అభిమానులకు మాత్రం ఇది చాలా పెద్ద విషయం అని చెప్పాలి. అదే టైమ్ లో ఈ మూవీ లవర్స్ అందరికీ పండగే. ఈ మూవీ రిలీజ్ టైమ్ లో ఎంతోమంది లవర్స్ తో కలిసి థియేటర్స్ లో చూశారు. మరి ఇప్పుడు ఆ జంటలు నిజంగా పెళ్లయ్యాయా.. లేక విడిపోయాయా అనేది తెలియదు కానీ.. నాటి లవర్స్ అందరినీ ఈ మూవీ మళ్లీ గుర్తుకు తెస్తుంది. మొత్తంగా ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్టుగా మార్పులు చేశారీ చిత్రాన్ని. మరి ఈ మూవీ ఈ రీ రిలీజ్ లో ఎలాంటి విజయం అందుకుంటుందో కానీ.. 2014 జనవరి 6న ఆత్మహత్య చేసుకున్న ఉదయ్ కిరణ్ కి మాత్రం మరోసారి మనసుకు నచ్చేలా మూవీ అవుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
