Un Stoppable: అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా : బాలకృష్ణ

Un Stoppable: అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా : బాలకృష్ణ
X
నా మాటలను కావాలనే వక్రీకరించారు రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం

నర్సులపై వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు బాలకృష్ణ. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను…నా మాటలను కావాలనే వక్రీకరించారు రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా అంటూ పోస్ట్ చేశారు బాలకృష్ణ.

ఇటీవల ఓ టాక్ షోలో నర్సుల గురించి కూడా ఒక కామెంట్ చేశారు బాలయ్య. పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ లో నర్సు దాని.. యమా అందంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. దీని పై పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నర్సులను కించపరిచేలా బాలయ్య వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. దీనిపై బాలయ్య స్పందించారు.

Tags

Next Story