సినిమా

Samrat Movie : టైటిల్ విషయంలో బాలయ్య మూవీతో వివాదం.. రమేష్ బాబు ఎంట్రీ ఇలా..!

Samrat Movie : సినిమాకి కథ ఎంత ముఖ్యమో టైటిల్ కూడా అంతే ముఖ్యం.. ఒక్కోసారి టైటిల్ సినిమా స్థాయిని పెంచుతుంది. ప్రేక్షకుడిని థియేటర్ వరకు రప్పిస్తుంది కూడా.

Samrat Movie : టైటిల్ విషయంలో బాలయ్య మూవీతో వివాదం.. రమేష్ బాబు ఎంట్రీ ఇలా..!
X

Samrat Movie : సినిమాకి కథ ఎంత ముఖ్యమో టైటిల్ కూడా అంతే ముఖ్యం.. ఒక్కోసారి టైటిల్ సినిమా స్థాయిని పెంచుతుంది. ప్రేక్షకుడిని థియేటర్ వరకు రప్పిస్తుంది కూడా. అందుకే టైటిల్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు దర్శకనిర్మాతలు.. సినీ నిర్మాతలు ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే టైటిల్ ని రిజిస్టర్ చేయించుకోవడం అనేది ఇండస్ట్రీలో సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గడం అనేది కూడా అంతే సహజంగా జరుగుతుంది. కానీ ఓ టైటిల్ కోసం ఇద్దరు నిర్మాతలు చాలానే ఫైట్ చేశారు. ఇష్యూ పెద్దది కావడంతో సినీ పెద్దలు ఇందులో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

అక్కినేని వారసుడిగా నాగార్జున, రామానాయుడు వారసుడిగా వెంకటేష్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న టైం అది.. ఈ క్రమంలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడు రమేష్ బాబు ఎంట్రీ పై అందరిలో ఆసక్తి నెలకొంది. అప్పటికే చైల్డ్ అరిస్ట్ గా సినిమాలు చేసిన రమేష్ బాబు డెబ్యూ మూవీ బాధ్యతలను దర్శకుడు వి. మధుసూదనరావుకి అప్పగించారు కృష్ణ. ఈ సినిమాని పద్మాలయ స్టూడియో పైన తెరకెక్కించారు. బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ ని హీరోయిన్ గా, మ్యూజిక్ డైరెక్టర్ బప్పిలహరిని తీసుకున్నారు. సామ్రాట్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన 'బేతాబ్' అనే సినిమాకి ఇది రీమేక్.

అదే సమయంలో బాలకృష్ణ హీరోగా, కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కింది. విజయశాంతి హీరోయిన్.. ఈ సినిమాకి కూడా సామ్రాట్ అనే టైటిల్ పెడదామని అనుకున్నారు. అటు రమేష్ బాబు, ఇటు బాలయ్య సినిమాలు ఇదే టైటిల్ తో షూటింగ్ జరుపుకున్నాయి. ఇదే టైటిల్ తో పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.. దీనితో టైటిల్ విషయంలో కాస్త వివాదం చోటుచేసుకుంది.

దీనితో నిర్మాతలు కోర్టుకెక్కారు. ఫలితంగా సామ్రాట్ టైటిల్ హక్కులు నిర్మాత కృష్ణకి చెందుతాయని కోర్టు చెప్పడంతో బాలకృష్ణ సినిమాని 'సాహస సామ్రాట్' అనే పేరుతో రిలీజ్ చేశారు. అయితే ఇందులో రమేష్ బాబు 'సామ్రాట్' సినిమా హిట్ అవ్వగా, బాలకృష్ణ సాహస సామ్రాట్ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఈ సినిమాల మధ్యలో హీరో సుమన్ 'ప్రేమసామ్రాట్' మూవీ రిలిజైంది.

Next Story

RELATED STORIES