Unni Mukundan : మార్కోను బ్యాన్ చేశారు..

ఇప్పటి వరకూ ఇండియాలో ఎన్నో వయెలెంట్ మూవీస్ వచ్చాయి.. కానీ థియేటర్స్ లో సినిమా చూస్తున్నప్పుడు ఆ హింసాత్మక ఘటనలకు భయ భ్రాంతులకు గురి కావడం.. ఆ రక్తంలో మనమూ ఉన్నాం అన్న భావన తెచ్చిన సినిమాలు చాలా తక్కువ. కానీ ఆర్టిస్ట్ లతో పాటు ఆడియన్స్ ను కూడా రక్తంలో మునిగిపోయారా అన్నట్టుగా చేసిన సినిమా ‘మార్కో’. అంతకు ముందు కిల్ అనే సినిమా బాలీవుడ్ లో వచ్చింది. కానీ ఈ మళయాల మార్కో ముందు అది జుజుబీ అన్నట్టుగా కనిపిస్తుంది.
మోస్ట్ వయెలెంట్ మూవీ ఆఫ్ ఇండియా అని కూడా మార్కోను చెప్పొచ్చు. ప్రతి ఫైట్ లోనూ రక్తం ఏరులై పారుతుంది. అలాంటి సినిమా 100 కోట్లు వసూలు చేయడమే అసలైన ఆశ్చర్యం. అంటే ఎంత హింసాత్మకంగా ఉన్నా ఇందులోనూ కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ కే కలెక్షన్స్ వచ్చాయి అన్నారు మేకర్స్. బట్ ఇలాంటి మూవీస్ ను ఇంటిల్లి పాదీ చూడటం అంటే ప్రమాదమే. అందుకే ఆ మధ్య ఓటిటిలో విడుదలైన ఈ చిత్రాన్ని తాజాగా బ్యాన్ చేశారు. అంతే కాదు.. శాటిలైట్ లోనూ ప్రసారం కాకుండా పూర్తిగా బ్యాన్ చేశారు. మరి ఈ నిషేధంపై మూవీ టీమ్ లీగల్ స్టెప్స్ ఏమైనా తీసుకుంటుందా అనేది చూడాలి. కాకపోతే ఇలాంటి మూవీస్ ఇలా ఓటిటి, టివిల్లో రావడం మాత్రం నెగెటివ్ ఎఫెక్ట్ నే చూపిస్తాయి అని చెప్పాలి.
ఉన్ని ముకుందన్, సిద్ధిఖీ, యుక్తి తరేజా, జగదీష్, కబీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన మార్కోను హనీఫ్ అదేనీ డైరెక్ట్ చేశాడు. ఈ దర్శకుడికే రీసెంట్ గా బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకడైన కరణ్ జోహార్ నుంచి పిలుపు వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com