Balakrishna : ‘అన్ స్టాపబుల్’ (పెయిడ్) ప్రమోషన్స్

Balakrishna :  ‘అన్ స్టాపబుల్’ (పెయిడ్) ప్రమోషన్స్
X

నందమూరి బాలకృష్ణ ఫస్ట్ టైమ్ హోస్టింగ్ చేసిన షో అన్ స్టాపబుల్. తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా కోసం మొదలైన ఈ షో ఆ ఓటిటిలోనే హయెస్ట్ వ్యూయర్ షిప్ తెచ్చుకుంది. బాలయ్యపై అప్పటి వరకూ ఉన్న ఇమేజ్ ను పోగొట్టి సిసలైన హీరోను చూపించింది. ఆయనెంత జోవియల్ గా ఉంటాడో చూపడంతో పాటు తను మాత్రమే కొన్ని ప్రశ్నలు అడగగలడు అనిపించుకుంది. అందుకే షో కంటిన్యూ అయింది.మధ్యలో పొలిటీషియన్స్ ను కూడా తీసుకువచ్చారు. అప్పుడప్పుడూ కొత్త సినిమాల ప్రమోషన్స్ లానూ కనిపించింది. బట్ ఈ సీజన్ 4 చూస్తుంటే పూర్తిగా ప్రమోషన్స్ కే పరిమితం అయినట్టు కనిపిస్తోంది. ఈ వరస చూస్తుంటే ఇవన్నీ పెయిడ్ ప్రమోషన్సా అనే ఆశ్చర్యం కూడా కలుగుతోంది.

అన్ స్టాపబుల్ సీజన్ 4 ఏపి సిఎమ్ చంద్రబాబు నాయుడుతో మొదలైంది. ఆ ఫస్ట్ ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ అయింది. బట్ తర్వాతే అన్నీ సినిమా ప్రమోషన్స్ లాగా మారింది. తర్వాత లక్కీ భాస్కర్ టీమ్ వచ్చింది. ఈ టీమ్ తో మంచి ఫన్ క్రియేట్ చేసినా.. ఎక్కడో ఈ షోలో ఆయా స్టార్స్ కు సంబంధించిన నోస్టాల్జిక్ మూమెంట్స్ ను పంచుకుంటారు అనుకుంటే ఎక్కువగా ఆయా సినిమాల గురించే హైలెట్ అవుతోంది.

తాజాగా మూడో ఎపిసోడ్ ను కంగువా ప్రమోషన్స్ కు కేటాయించారు. ప్రోమో పరంగా చూస్తే సూపర్ హిట్ అనే చెప్పాలి. సూర్యతో ఎన్నో విషయాలు చెప్పించాడు. బట్ ఇవన్నీ రొటీన్ గానే ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ ను అడిగిన ప్రశ్నలే కాస్త అటూ ఇటూగా ఉన్నాయి. కాలేజ్ క్రష్ ఎవరు, కార్తీతో ఎలాంటి రిలేషన్, జ్యోతిక గురించిన కబుర్లు.. ఇవన్నీ రెగ్యులర్ గా వార్తల్లో ఉంటున్న అంశాలే. ఏ సినిమా ప్రమోషన్ లోనో ఇంటర్వ్యూలోనే చెప్పుకుంటూ వస్తున్నవే. ఏ మాత్రం కొత్తదనం లేని ప్రశ్నలు, సమాధానాలు.

ఇక ఈ థర్డ్ ఎపిసోడ్ లో సూర్య చేసిన సమాజ సేవకు సంబంధించిన అంశం రాగానే సూర్య, బాలయ్యతో పాటు అక్కడున్న ఆడియన్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటివి కాస్త ఇన్స్ స్పైరింగ్ గా ఉంటాయోమో కానీ.. ఈ సీజన్ 4 లోని సెకండ్, థర్డ్ ఎపిసోడ్స్ పూర్తిగా సినిమా ప్రమోషన్స్ లాగానూ, అందుకోసం పెయిడ్ ప్రమోషన్స్ చేయిస్తున్నట్టుగానూ.. అంతకు మించి రొటీన్ ప్రశ్నలతోనూ కొనసాగుతోందనే అభిప్రాయం మెజారిటీ ఆడియన్సెస్ లో కనిపిస్తోంది. పెయిడ్ ప్రమోషన్స్ చేయడం తప్పేం కాదు. బట్.. ఆడియన్స్ ఏం ఎక్స్ పెక్ట్ చేసి ఈ షోను బ్లాక్ బస్టర్ చేశారో.. మెల్లగా ఆ ఫ్లేవర్ మిస్ అవుతుందనేదే అసలు సమస్య అంటున్నారు చాలామంది.

Tags

Next Story