Unstoppable With NBK 2: బాలయ్య లుక్ సూపర్.. తగ్గేదేలే..

Unstoppable With NBK 2: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. సెలబ్రెటీలతో బాలయ్య చేసిన హంగామా ఈ షోని టాప్ రేటింగ్‌కి తీసుకెళ్లింది. తనదైన శైలిలో, పంచ్ డైలాగులు వేస్తూ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. మొదటి సీజన్ విజయవంతం కావడంతో సెకండ్ సీజన్‌కు ప్లాన్ చేశారు నిర్వాహకులు.
ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ప్రకటించారు. ఈ క్రమంలోనే షోకు సంబంధించిన మరొక ప్రకటన వెలువడింది. షో టీజర్‌ను రేపు (మంగళవారం) విడుదల చేయనున్నారు. ఇందులో బాలయ్య లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
డిఫరెంట్ లుక్‌లో యంగ్ హీరోలతో పోటీ పడుతున్నట్లు ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉంది ఆయన లుక్. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన టీజర్ రేపు సాయింత్రం 6 గంటలకు విజయవాడలో లాంచ్ చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com