సినిమా

Unstoppable with NBK Promo: అన్‌స్టాపబుల్ విత్ మోహన్ బాబు.. బాలయ్య టాక్ షో ప్రోమో విడుదల..

Unstoppable with NBK Promo: టాక్ షోలకు ఉన్న క్రేజ్ పెరిగిపోవడంతో నటీనటులు హోస్ట్‌లుగా మారడానికి ఆసక్తి చూపిస్తున్నారు

Unstoppable with NBK Promo: అన్‌స్టాపబుల్ విత్ మోహన్ బాబు.. బాలయ్య టాక్ షో ప్రోమో విడుదల..
X

Unstoppable with NBK Promo: టాక్ షోలకు ఉన్న క్రేజ్ విపరీతంగా పెరిగిపోవడంతో వెండితెర నటీనటులు చాలామంది హోస్ట్‌లుగా మారడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా హోస్ట్‌గా మారడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆహాలో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షో చేస్తున్నట్టు అధికారికరంగా ప్రకటించారు బాలయ్య. తాజాగా ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలయ్యింది.

'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'లో మొదటి ఎపిసోడ్‌కు మంచు వారి ఫ్యామిలీని ఆహ్వానించారు బాలయ్య. బాలకృష్ణకు మంచు కుటుంబంతో మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. దీంతో ఫస్ట్ ఎపిసోడ్ అంతా సరదాగా నవ్వులతో సాగిపోనుందని అర్థమవుతోంది.

మోహన్ బాబు, మంచు లక్ష్మి, విష్ణు.. 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' ఫస్ట్ ఎపిసోడ్‌కు గెస్ట్‌లుగా వచ్చారు. మోహన్ బాబుకు, బాలయ్యకు ఉన్న సాన్నిహిత్యం వల్ల షో సరదాగా సాగిపోనుంది. కానీ మధ్య మధ్యలో కొన్ని సీరియస్ సంభాషణలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా బాలయ్య, మోహన్ బాబు వారి రాజకీయ జీవితాల గురించి కూడా చర్చించుకున్నారు. మొత్తానికి అన్స్‌స్టాపబుల్ షోలో ఫన్‌కు ఫుల్‌స్టాప్ లేదని స్పష్టమవుతోంది.

మోహన్ బాబును తను నటించిన సినిమాల్లో అస్సలు ఇష్టం లేని సినిమా ఏది అని అడగగా పటాలం పాండు అని బయటపెట్టారు. రాజకీయ విషయాల గురించి మాట్లాడుతూ ఉండగా షో సాక్షిగా నేను నిన్ను ఎప్పుడైనా కష్టపెట్టానా అని మోహన్ బాబును అడిగారు బాలయ్య. ఆ తర్వాత విష్ణు, మంచు లక్ష్మి వచ్చి షోలో జాయిన్ అయ్యాక ఫన్ మరింత రెట్టింపు అయ్యింది.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES