Unstoppable With NBK: 'నా కెరీర్‌లో నేను మర్చిపోలేని క్యారెక్టర్ అదే'.. అన్‌స్టాపబుల్ షోలో బాలయ్య..

Unstoppable With NBK: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే టాక్ షో నిజంగానే అన్‌స్టాపబుల్‌గానే దూసుకుపోతోంది. సీనియర్ హీరో బాలయ్య ఒక హోస్ట్‌గా వ్యవహరించగలరని, హోస్ట్‌గా ఇంతగా ఎంటర్‌టైన్ చేయగలరని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం అన్‌స్టాపబుల్.. ఐఎమ్‌డీబీలోనే టాప్ 10 రియాలిటీ షోలలో ఒకటిగా వెలుగుతుందంటే దానికి కేవలం బాలయ్యే కారణం అనడంలో ఆశ్చర్యం లేదు. అన్‌స్టాపబుల్ 9వ ఎపిసోడ్‌లో 'లైగర్' మూవీ టీమ్ స్టేజ్‌పై సందడి చేయనున్నారు.
పూరీ జగన్నాథ్.. హీరోల మ్యానరిజంతో అందరినీ మెప్పించడంలో ఎక్స్‌పర్ట్. అలాంటి పూరీ.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి తెరకెక్కిస్తున్న చిత్రమే 'లైగర్'. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ మరోసారి ఆగిపోయింది. కానీ ఈ సినిమా ట్రైలర్‌తో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. లైగర్ టీమ్ అంతా బాలయ్యతో చేసిన సందడికి సంబంధించిన ఎపిసోడ్ 9 ప్రోమో ఇటీవల విడుదలయ్యింది.
బాలకృష్ణ, పూరీ జగన్నాధ్ కలిసి చేసిన ఒకేఒక్క చిత్రం 'పైసా వసూల్'. ఈ సినిమా, ఇందులోని తేడా సింగ్ క్యారెక్టర్.. బాలయ్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే తన ఇన్నాళ్ల కెరీర్‌లో బాలయ్య మర్చిపోలేని క్యారెక్టర్ అదేనంటూ అన్‌స్టాపబుల్ షోలో తెలిపారు. పూరీ జగన్నాధ్‌తో పాటు ఛార్మీ, విజయ్ దేవరకొండ కూడా అన్‌స్టాపబుల్ ఫన్‌ను అందించారు.
బాలకృష్ణ, ఛార్మీ కలిసి 'అల్లరి పిడుగు' అనే చిత్రంలో నటించారు. అయితే ఆ సినిమా సమయంలో చాలా చిన్నపిల్లలాగా ఉండేదని, ఇప్పుడు నిజంగానే పిడుగులాగా అయ్యిందని ఛార్మికి కాంప్లిమెంట్ ఇచ్చారు బాలయ్య. విజయ్ దేవరకొండను ప్రేమగా పలకరిస్తూ సమరసింహారెడ్డి వెల్‌కమ్స్ అర్జున్ రెడ్డి అని బాలయ్య చెప్పిన మాట అందరినీ నవ్వించింది. ప్రోమోలోనే ఇంత ఫన్ ఉండే ఇక ఎపిసోడ్‌లో ఎంత ఫన్ ఉంటుందో అనుకుంటున్నారు ప్రేక్షకులు. లైగర్ టీమ్ స్పెషల్ ఎపిసోడ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఆహాలో స్ట్రీమ్ కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com