Unstoppable With NBK: 'అన్‌స్టాపబుల్' షోకు మరో రికార్డ్.. అది బాలయ్యకే సాధ్యం..

Unstoppable With NBK: బాలకృష్ణ.. కొన్నాళ్ల క్రితం వరకు ఈయన ఒక మాస్ హీరో. కానీ ఇప్పుడు ఒక సూపర్ హోస్ట్ కూడా. 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'లో బాలయ్య హోస్టింగ్ చూసిన తర్వాత మరే ఇతర టాలీవుడ్ హీరోలు కూడా ఇంత ఎంటర్‌టైనింగ్‌గా హోస్టింగ్ చేయలేరేమో అనిపించింది ప్రేక్షకులకు. అందుకేనేమో అన్‌స్టాపబుల్ షో ఖాతాలో రికార్డుల మీద రికార్డులు వచ్చి పడుతున్నాయి.
చాలావరకు ప్రేక్షకులు బాలయ్య హోస్టింగ్ అనగానే ఎలా ఉంటుందో అని భయపడ్డారు. కానీ ఆయన మొదటి ఎపిసోడ్ నుండే తనలోని కొత్త యాంగిల్‌ను చూపించి వారిని ఆశ్చర్యపరిచాడు. గెస్ట్ ఎవరైనా కానీ, వారితో సరదాగా కబుర్లు చెప్తూ.. హోస్ట్‌గా ఎంటర్‌టైన్మెంట్‌లో తనవంతు పాత్ర పోషిస్తాడు బాలయ్య. అందుకేనేమో ఆహాలోని టాక్ షోల్లో ఇదే బెస్ట్‌గా నిలిచింది.
ఇప్పటికే ఐఎమ్‌డీబీ రేటింగ్స్ విషయంలో ఇండియాలోనే టాప్‌లో ఉంది అన్‌స్టాపబుల్. దాంతో పాటు తాజాగా మరో రికార్డును కూడా ఈ షో సొంతం చేసుకుంది. మొత్తంగా ఇప్పటివరకు అన్‌స్టాపబుల్ షో 40 కోట్ల నిమిషాలు స్ట్రీమ్ అయినట్లు ఆహా తెలిపింది. బాలకృష్ణ ఇప్పటివరకు హీరోగానే కాదు.. హోస్ట్‌గా కూడా రికార్డులను తిరగరాయగలడు అని ప్రూవ్ చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com