Upasana: బీచ్‌లో బేబీ షవర్.. షేర్ చేసిన ఉపాసన

X
By - Prasanna |5 April 2023 2:24 PM IST
Upasana: టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ ఉపాసన రామ్‌చరణ్. ప్రస్తుతం వీళ్లిద్దరూ దుబాయ్ వెకేషన్‌లో ఉన్నారు.
Upasana: టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ ఉపాసన రామ్‌చరణ్. ప్రస్తుతం వీళ్లిద్దరూ దుబాయ్ వెకేషన్‌లో ఉన్నారు. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న ఈ జంట ఆ అపురూప క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా దుబాయ్‌లోని నమ్మోస్ బీచ్ క్లబ్‌లో ఉపాసనకు బేబీ షవర్ వేడుకను నిర్వహించారు స్నేహితులు, కుటుంబసభ్యులు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉపాసన తన ఇన్‌స్టాలో.. మీ అందరి ప్రేమకు చాలా కృతజ్ఞతలు. నా జీవితంలో బెస్ట్ బేబీ షవర్ ఇచ్చిన నా డార్లింగ్ సిస్టర్స్‌కి ధన్యవాదాలు అని పోస్ట్ చేసింది. ఈ వేడుకలో రామ్ చరణ్, ఉపాసనల స్నేహితులు, కజిన్స్ పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com