పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన..
మెగా ఇంటికి కోడలవ్వకముందే ఉపాసనకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అపోలో హాస్పిటల్ చైర్మన్ మనవరాలైన అణుకువగా ఉంటుంది.. కించిత్ గర్వం కూడా లేని ఉపాసన అంటే రామ్ చరణ్ అభిమానులకే కాదు అందరికీ ఓ ప్రత్యేకమైన అభిమానం ఆమెపై ఉంటుంది. తన డ్రెస్సింగ్ సెన్స్ కానీ, మాట్లాడేతీరు కానీ ఆమెని ఎప్పుడూ ఓ మెట్టు పైనే ఉంచుతాయి.
మరి కొద్ది రోజుల్లో ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఆమె కుటుంబసభ్యులతో పాటూ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఉపాసన ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం మాట్లాడినా ఆలోచింప చేసేదిగా ఉంటుంది. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ కోసం ఆమె రక్తాన్ని భద్రపరచాలని అనుకుంటోంది. బొడ్డు నుంచి తీసిన రక్తాన్ని ప్రత్యేక పద్దతిలో భద్రపరచనున్నట్లు సమాచారం. కార్డ్ బ్లడ్ అని పిలిచే ఈ బ్లడ్ వల్ల భవిష్యత్తులో ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆ సమస్యలను నివారించేందుకు ఉపయోగపడుతుందని సమాచారం.
ఉపాసన ముందు చూపుకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. స్టెమ్ సైట్ ఇండియా అనే సంస్థ ద్వారా ఉపాసన రక్తాన్ని భద్రపరచనున్నారని సమాచారం. ఉపాసన నిర్ణయంతో కుటుంబసభ్యులు కూడా ఏకీభవించారు. జులైనెలలో ఉపాసన తన మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. అదే నెలలో పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా కూడా విడుదల కానుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com