Upasana Konidela : పిల్లల విషయంలో క్లారిటీ ఇచ్చిన ఉపాసన..!

Upasana Konidela : టాలీవుడ్‌లో బెస్ట్ అండ్ క్యూట్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన ఒకరు... ఎంతో అన్యోన్యంగా ఉంటుంది ఈ జంట.. వీరికి పెళ్లై ఎనిమిదేళ్ళు అవుతోంది. అయితే ఇంకా పిల్లల విషయంలో ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. దీంతో ఎక్కడికెళ్ళిన పిల్లలు ఎప్పుడనే ప్రశ్న ఆమెకి ఎదురవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లల విషయంలో క్లారిటీ ఇచ్చింది ఉపాసన.. పిల్లల విషయం తన వ్యక్తిగతమని చెప్పుకొచ్చింది ఉపాసన. దీనిపైన చాలామంది అడుగుతున్నప్పటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అంది. ఇప్పుడు దానికి సమాధానం చెప్పి దానిని సెన్సేషన్ చేయడం ఇష్టం లేదని తెలిపింది. దీనికి సరైన సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని తెలిపింది. కాగా రామ్ చరణ్ నటించిన సినిమాలలో రంగస్థలం చిత్రం తనకెంతో ఇష్టమని వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com