Upasana Konidela : వామ్మో... థియేటర్‌లో రచ్చ రచ్చ చేసిన ఉపాసన.. !

Upasana Konidela : తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. టోటల్ ఇండియాన్ సినిమా ఎదురుచూస్తోన్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఎట్టకేలకు నేడు (మార్చి 25)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్స్ వద్ద అభిమానుల హంగామా మామూలుగా లేదు.. ప్రస్తుతం ఈ సినిమాకి ఎక్కడి నుంచి చూసిన పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. జక్కన్న డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించారు.
ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించాడు. అయితే ఈ సినిమాని థియేటర్‌లో అభిమానులతో కలిసి చూసి ఫుల్ ఎంజాయ్ చేసింది చరణ్ సతీమణి ఉపాసన.. ఓ థియేటర్‌లో అభిమానులతో కలసి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వీక్షించారు ఆమె.. చరణ్‌కి వైఫ్ గా కాకుండా ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఓ అభిమానిగా ఆమె సినిమా చూసినట్టుగా కనిపిస్తోంది.
ముఖ్యంగా నాటు నాటు సాంగ్ వచ్చినప్పుడు అయితే ఆమె పైకి లేచి మరి పేపర్లు విసురుతూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమా చూసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉపాసన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం చాలా బాగుందని వెల్లడించింది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందించారు.
She is all of us right now!! 🤩🤩#Upasana enjoying #RRRMovie at a MASS Theater!! 💥💥🤩🤩#RamCharan #JrNTR #SSRajamouli #RRRDay #TeluguFilmNagar pic.twitter.com/jnb0vzpIfr
— Telugu FilmNagar (@telugufilmnagar) March 25, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com