Upasana: 'ఉపాసన' డైరెక్షన్‌లో 'శర్వానంద్'.. అతిధి పాత్రలో..

Upasana: ఉపాసన డైరెక్షన్‌లో శర్వానంద్.. అతిధి పాత్రలో..
ఉపాసన కొణిదెల ఓ షార్ట్ ఫిల్మ్ తీయనున్నారు. ఇందులో శర్వానంద్ డాక్టర్.

Upasana: అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్మన్, మెగాస్టార్ కోడలు, రామచరణ్ భార్య ఉపాసన కొణిదెల కూడా మెగా ఫోన్ పట్టనుంది. హీరో శర్వానంద్ కథానాయకుడిగా ఓ షార్ట్ ఫిల్మ్ తీయడానికి ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. కరోనా వైరస్ బారిన పడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రాణాలు ఫణంగా పెట్టి రోగులకు అత్యవసర చికిత్స అందించారు వైద్యులు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా వ్యవహరించిన వారి సేవలు మరువలేనివి. ఇదే అంశాన్ని తీసుకుని వైద్యుల గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉపాసన ఓ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. ఇందులో హీరో శర్వానంద్ డాక్టర్ పాత్రలో నటిస్తుంటే, అతిధి పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story