Tollywood : ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..!

Tollywood : మార్చి, ఏప్రిల్ నెలల్లో RRR, KGF2, ఆచార్య లాంటి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడంతో చిన్నచిన్న సినిమాలు వాయిదా వేసుకున్నాయి. ఎట్టకేలకు మే మొదటివారంలో ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అయిపోయాయి. ఈ వారంలో థియేటర్/ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు ఏంటో ఇప్పుడు చూద్దాం..!
భళా తందనాన : యంగ్ హీరో శ్రీవిష్ణు మెయిన్ లీడ్ లో వస్తోన్న ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. వారాహి చలన చిత్రం పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాకి చైతన్య దంతులూరి దర్శకత్వం వహించగా, కేథరిన్ హీరోయిన్ గా నటించింది.
జయమ్మ పంచాయతీ : యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకి ఎంతో దగ్గరైన సుమ వెండితెర పై మెరుస్తోన్న మూవీ 'జయమ్మ పంచాయతీ'.. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 6న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో పల్లెటూరి మహిళా పాత్రలో కనిపిస్తోంది సుమ.
అశోకవనంలో అర్జున కళ్యాణం : కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' చిత్రం మే 6వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు.
చిన్ని: డీగ్లామర్ రోల్ లో మహానటి ఫేం కీర్తి సురేష్ నటిస్తోన్న మూవీ 'చిన్ని'.. సెల్వరాఘవన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అరుణ్ మథేశ్వరం దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 6న ఓటీటీ అమెజాన్‌ప్రైమ్ వేదికగా రిలీజ్ కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com