Devara Update : దేవర అప్ డేట్.. జూ.ఎన్టీఆర్ డ్యాన్స్‌పై జాన్వీ స్పందన
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవరపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ తోపాటు సినీ ప్రియులు ఎంతగానే వెయిట్ చేస్తున్నారు. మూవీకి సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా ఫుల్ సంబరపడిపోతున్నారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చి ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇంకా దేవర రిలీజ్ కాకుండానే రామ్ చరణ్ సినిమాలో ఆఫర్ కొట్టేసింది. మరిన్ని ఆఫర్స్ కూడా ఆమెకు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచో టాలీవుడ్ కు రావాలని చూస్తున్న జాన్వీ... తెలుగు డెబ్యూ మూవీ దేవరను బాగా ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో దేవరకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తాజాగా తన హిందీ మూవీ ఉలజ్ ప్రమోషన్స్ లో భాగంగా మరోసారి దేవర సినిమా గురించి మాట్లాడింది జాన్వీ. మూవీలో తన పాత్ర ఎలా ఉంటుందో చెప్పింది. తంగం పాత్రలో కనిపించనున్న అమ్మడు.. తన రోల్ సరదాగా ఉంటుందని చెప్పింది. ఆడుతూ పాడుతూ రొమాన్స్ చేసే రోల్ అని తెలిపింది. ఫస్ట్ పార్ట్ కన్నా రెండో భాగంలోనే తన పాత్ర ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. తారక్ తో డ్యాన్స్ విషయంపై కూడా మాట్లాడింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సాంగ్ చేశానని తెలిపింది. నెక్స్ట్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com