నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఓ ట్రాన్స్‌జెండర్‌.. నా బాడీ షేమింగ్‌పై వచ్చిన కామెంట్స్ బాధించాయి : ఉపాసన

నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఓ ట్రాన్స్‌జెండర్‌..  నా బాడీ షేమింగ్‌పై వచ్చిన కామెంట్స్ బాధించాయి : ఉపాసన
Upsana konidela : ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా కోడలుగా, రామ్‌ చరణ్‌ తేజ్ భార్యగానే కాకుండా సామాజిక సేవ కార్యక్రమాలతో తనకంటూ ఓ ఫేమ్ తెచ్చుకున్నారు.

Upsana konidela : ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా కోడలుగా, రామ్‌ చరణ్‌ తేజ్ భార్యగానే కాకుండా సామాజిక సేవ కార్యక్రమాలతో తనకంటూ ఓ ఫేమ్ తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌‌‌గా ఉంటూ.. తన వ్యక్తిగత విషయాలను, తన భర్త రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు ఆమె. ఉపాసనను చూసినవారు ఆమె తన లైఫ్‌‌లో ఎలాంటి కష్టాలు పడలేదు.. గోల్డెన్‌ స్పూన్‌తో పుట్టిందని అనుకుంటూ ఉంటారు. అలా అనుకునేవారికి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చింది ఉపాసన.

ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయని, ఎవరి ప్రాబ్లమ్స్ వారివి.. వారి బాధకు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పుకొచ్చింది ఉపాసన.. నిజం చెప్పాలంటే లైఫ్ అనేది ఓ టాస్క్ అని అదంతా ఈజీగా ఉండదని తెలిపింది.. తాను ఒకానొక సమయంలో ఎన్నో ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశానని, లడ్డు అంటూ నా బాడీ షేమింగ్‌పై వచ్చిన కామెంట్స్‌ తనని ఎంతగానో బాధించాయని ఉపాసన అన్నారు.. అయితే ఇప్పుడు తనని చూసి చాలా మంది బాగున్నావని అంటున్నారని, కానీ దానిని పెద్ద కాంప్లీమెంట్‌గా తీసుకోలేకపోతున్నానని ఆమె తెలిపారు. ఎందుకంటే తాను ఇలా అవ్వడానికి దానిపై శ్రద్ధ పెట్టానని, గంటలు గంటలు దాని పైన వర్క్‌ చేస్తున్నాను కాబట్టి సన్నగా తయారయ్యానని ఉపాసన ఆ ఇంటర్వ్యూలో తెలిపింది.

ఇక పురుషులు, స్త్రీల మధ్య భేదాభిప్రాయాలు అనవసరమని చెప్పింది ఉపాసన.. ఎవరి బలం వారిదని అభిప్రాయపడింది. తన బెస్ట్‌ ఫ్రెండ్‌ ఓ ట్రాన్స్‌జెండర్‌ అని తను అన్ని విషయాల్లో చురుగ్గా, ప్రతిభ కలిగి ఉంటారని ఉపాసన చెప్పుకొచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story