Urvashi Rautela : ఐటమ్ బ్యూటీకి గుడి కట్టాలట

Urvashi Rautela :  ఐటమ్ బ్యూటీకి గుడి కట్టాలట
X

పిచ్చి పలు రకాలు అంటారు కదా. అలా ఈవిడదీ ఒక రకమైన పిచ్చి. ఏదైనా నాన్ సింక్ లో మాట్లాడంలో ఎక్స్ పర్ట్ ఈ బ్యూటీ. ఎవరు ఎటు పోయినా.. తను మాత్రం అందులో తనదైన సెన్సేషన్ వెదుక్కుంటుంది. మరి ఆవిడెవరో ప్రత్యేకంగా చెప్పాలా.. తెలుగులో కేవలం ఐటమ్ సాంగ్స్ తో పాపులర్ అయిన ఊర్వశీ రౌతేలా. అమ్మడికి అంతకు ముందు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అది కూడా హాట్ హాట్ స్టెప్పులు, సాంగ్స్ తో మాత్రమే తప్ప అద్భుతమైన నటి అని మాత్రం కాదు. ఆ కారణంగానే కొందరు అభిమానులు ఈవిడకు బద్రీనాథ్ టెంపుల్ పక్కన గుడి కట్టారట. మరి నార్త్ లో నాకంత క్రేజ్ ఉంది అంటూనే.. అయినా తెలుగులో మాత్రం తక్కువేంటీ.. నాకు సౌత్ లో కూడా ఓ గుడి కట్టాల్సిందే అని పట్టుపట్టినంత పని చేస్తోంది. మరి దీన్ని పబ్లిసిటీ పిచ్చి కాక మరేమంటారు..?

2023 ఒక్క యేడాదిలో వాల్తేర్ వీరయ్యతో మొదలుపెట్టి ఏజెంట్, బ్రో, స్కంద చిత్రాల్లో చేసిన ఐటమ్ సాంగ్స్ తో బాగా గుర్తింపు తెచ్చుకుంది ఊర్వశి రౌతేలా. తర్వాత బాలయ్య డాకూ మహారాజ్ లో ఓ ఐటమ్ సాంగ్ తో పాటు కాస్త స్క్రీన్ స్పేస్ దక్కింది. ఆ స్పేస్ లో అమ్మడు చూపించిన నటనా చాతుర్యం అంటూ ఏం లేదనుకోండి. అయినా తెలుగులో తనో సూపర్ స్టార్ అనే రేంజ్ లో ఫీలైపోతోంది. మరి నిజంగానే తనకు ఇక్కడెవరైనా గుడి కట్టాలనుకుంటున్నారేమో చందాలు మొదలుపెట్టండిక.

Tags

Next Story