Ustaad Bhagat Singh : భారీ ధరకు ఉస్తాద్ భగత్ సింగ్ ఓటిటి రైట్స్

Ustaad Bhagat Singh :  భారీ ధరకు ఉస్తాద్ భగత్ సింగ్ ఓటిటి రైట్స్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ అదే. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఓటిటి రైట్స్ రూపంలో దక్కించుకున్న అమౌంట్ ఎంతో తెలిసిన వాళ్లంతా ఇదే అనుకుంటున్నారు. పవన్ రేంజ్ వేరు కదా. ఈ మూవీ తెరి అనే తమిళ్ మూవీకి రీమేక్. అదే చిత్రం తెలుగులో పోలీసోడు టైటిల్ తో రిలీజ్ అయింది. తెలుగులో కూడా ఇది ఫర్వాలేదు అనిపించుకుంది. అలాంటి మూవీని మళ్లీ రీమేక్ చేయడం అంటే కష్టం కదా. బట్ దర్శకుడు హరీష్ శంకర్.. ఆ కారణంగా అతను ఒరిజినల్ కంటే చాలా భిన్నంగా మార్పులు చేర్పులు చేస్తాడు అనే నమ్మకం ఉంది. ఆ కారణంగానే ఈ మూవీ రీమేక్ చేశారు. చాలా కాలం పాటు షూటింగ్ సాగింది. ఫైనల్ గా పూర్తయింది. మార్చి 27న విడుదల కాబోతోంది అని కూడా చెబుతున్నారు. రిలీజ్ కు దగ్గరగా ఉన్న టైమ్ కు ఇలాంటి డీల్స్ వస్తుంటాయి కదా.

ఇక ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించాల్సి ఉంది. బాగా లేట్ అవడంతో తను తప్పుకుంది. ఆ ప్లేస్ లో రాశిఖన్నా వచ్చింది. మరో హీరోయిన్ గా సాక్షి వైద్యను తీసుకున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా అవుట్ పుట్ పవన్ కి బాగా నచ్చింది అనే టాక్ ఉంది. ఆ కారణంగా థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా భారీ స్థాయిలో జరగబోతోంది. ముఖ్యంగా ఏపీలో ఈ మూవీకి ఫ్యాన్సీ రేట్ కు అమ్ముడు అయ్యే అవకాశాలున్నాయి. రీసెంట్ గా ఓ.జి మూవీకి భారీ స్థాయిలో వచ్చిన వసూళ్లు కూడా ఇందుకు ఓ కారణం. అందుకే ఇప్పుడు ఓటిటికి భారీ ధరకు అమ్మారు అంటున్నారు.

నెట్ ఫ్లిక్స్ సంస్థ వాళ్లు ఈ మూవీకి ఏకంగా 80 కోట్ల ధర చెల్లించేందుకు ముందుకు వచ్చింది. ఆల్మోస్ట్ ఈ డీల్ సెట్ అయిపోయినట్టే అనుకోవచ్చు. అయితే సినిమా రిజల్ట్ లో తేడాలు వస్తే ఈ ఓటిటి డీల్ లో కూడా తేడాలు వస్తాయి అనే రూట్ కూడా పెట్టుకుంది నెట్ ఫ్లిక్స్. బట్ కేవలం తెలుగు మూవీగానే విడుదల కాబోతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ కు ఈ స్థాయిలో ఓటిటిలో డీల్ రావడం చాలా అంటే చాలా పెద్ద విషయమే అని చెప్పాలి.

Tags

Next Story