Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ వస్తున్నాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెరి అనే తమిళ్ కు రీమేక్. కాకపోతే తెలుగుకు తగ్గట్టుగా అనేక మార్పులు చేశాడట హరీష్ శంకర్. ఆ మార్పులు అన్నీ అద్భుతంగా ఉండబోతున్నాయి అనే టాక్ ఉంది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఈ రెండు పాత్రలు కూడా ఒరిజినల్ కు దగ్గరలోనే ఉంటాయి అని చెబుతున్నారు. ఓ రకంగా ఈ మూవీ బాగా ఆలస్యం అయింది. ఈ మధ్య పవన్ మళ్లీ బిజీ అవుతున్నాడు. అందులో భాగంగానే హరిహర వీరమల్లును పూర్తి చేశాడు. అలాగే ఓ.జి మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అదే ఊపులోనే ఉస్తాద్ భగత్ సింగ్ ను సిద్ధం చేశాడు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకుందీ మూవీ. పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ పూర్తయినట్టే. అంటే ఇక రిలీజ్ డేట్ ప్రకటించడం ఒక్కటే కదా ఉండేది.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ను మార్చి 26న విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి ఆ డేట్ కు రావాల్సిన పెద్ది, ద ప్యారడైజ్ వాయిదా పడబోతున్నాయని క్లియర్ గా చెప్పేశారు. ఆ కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చిలో విడుదల చేయాలనుకున్నారు. అందుకే 26నే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సో.. ఈ సమ్మర్ లో పవన్ కళ్యాణ్ మూవీతో సందడి చేయడం గ్యారెంటీ అనేది తేలిపోయింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
