Ustad Bhagat Singh OTT : ఓటిటిలో ఉస్తాద్ భగత్ సింగ్

Ustad Bhagat Singh OTT :  ఓటిటిలో ఉస్తాద్ భగత్ సింగ్
X

పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మార్చి 19న విడుదలైంది. అదే రోజు ధురంధర్ 2 కూడా విడుదల కావడంతో ఈ చిత్రానికి కొంత మైనస్ జరిగింది. ధురంధర్ 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా తేలడంతో ఈ మూవీపై ప్రభావం పడింది. ఆ కారణంగా చెప్పుకోదగ్గ వసూళ్లు మాత్రం రాలేదు. ఓ రకంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. నిజానికి ఈ మూవీ కథ, కథనం చాలా బావున్నాయి. పవన్ స్టైల్ కావొచ్చు, పవర్ ఫుల్ ప్రెజెన్స్ తో పాటు హరీశ్ శంకర్ డైలాగ్స్ కూడా అదిరిపోయాయి. చాలా సీన్స్ కు విజిల్స్ పడ్డాయి. అయినా మూవీ ఫ్లాప్ గా తేలిపోయిందీ అంటే చాలా వరకూ చాలామంది చేసిన నెగెటివ్ స్ప్రెడ్. కావాలనే కొందరు ఈ మూవీపై నెగెటివ్ ప్రచారం చేశారు. అది కూడా ఈ చిత్రంపై ఓ రకమైన ఇంపాక్ట్ పడింది.

ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్స్ లో మరీ పెద్ద విజయం సాధించకపోయినా ఓటిటిలో రిలీజ్ కు రెడీ అయింది. ఈ మూవీ ఏప్రిల్ 16న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతోంది. అదే రోజు నుంచి స్ట్రీమింగ్ మొదలవుతోంది. ఓ రకంగా ఈ మూవీపై ఓటిటి నుంచి భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశాలున్నాయి. థియేటర్స్ నుంచి నెగెటివ్ టాక్ వచ్చినా.. ఓటిటి నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. అందుకు తగ్గ కంటెంటే ప్రధానం. మరి ఈ మూవీ ఓటిటి నుంచి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుందో అనేది చూడాలి.

Tags

Next Story