Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది

హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాశిఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసింది మూవీ టీమ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ఇది. ట్రైలర్ చూడగానే పవన్ కళ్యాణ్ ఊచకోత కన్ఫార్మ్ అన్నట్టుగా ఉంది. పంచ్ డైలాగ్ లు, హీరో నుంచి ప్రతి సీన్ లోనూ ఎలివేషన్స్ ఇవ్వాలనే టార్గెట్ కూడా ఉన్నట్టుగా ట్రైలర్ చూడగానే అర్థం అవుతుంది. ట్రైలర్ ఆసాంతం పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కనిపిస్తోంది.
వయొలెన్స్ అంటే మీనింగ్ తెలియక మీ అందరికీ ఫ్యాషన్ అయిపోయింది.. రెడ్డి గారు ఈ బిల్డప్ లు, ప్రాస కోసం ప్రాణాలు మీదకి తెచ్చుకోవద్దు.. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డ్యాన్స్.. సంతోషం ఉండటం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం.. మన జీవితాన్ని ఎవడెవడో లైకులు కొట్టడం కాదు.. భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్.. ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం.. ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటదో చూస్తావా.. అంటూ వరుస డైలాగ్స్ సింప్లూ సూపర్బ్ గ్యారెంటీ అనిపించేలా ఉంది ట్రైలర్. ట్రైలర్ చివర్లో ఈ సారి పర్ఫార్మెన్స్ బద్ధలైపోద్ది.. ఊఠ్ సాలే... అనే డైలాగ్ తో ఎండ్ అయింది.
ట్రైలర్ లో కాస్త పొలిటికల్ డైలాగ్స్ కూడా యాడ్ అయ్యేలా ఉన్నట్టుగా ఉన్నా.. సినిమా కథలో భాగంగానే ఉంటాయి అనిపించేలా ఉన్నాడు. ఓ రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఈ సారి గబ్బర్ సింగ్ లాంటి యాటిట్యూడ్ తో కనిపించబోతున్నాడు అనేలా ఉన్నాడు. శ్రీలీల, రాశిఖన్నా పాత్రలేంటీ అనేది క్లారిటీ లేకుండా ఉంది ట్రైలర్. కాకపోతే కేవలం పవన్ ను హైలెట్ చేయడమే ట్రైలర్ టార్గెట్ లా ఉంది. మొత్తంగా ఈ మూవీలో పాటలు దేవీశ్రీ ప్రసాద్ అందిస్తే.. నేపథ్య సంగీతం థమన్ అందించబోతున్నాడు. మరి ఈ సారి పర్ఫార్మెన్స్ బద్ధలైపోతుందా లేదా అనేది మూవీ రిలీజ్ రోజున ఈ 19న తేలిపోతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
