వి మూవీ రివ్యూ

వి మూవీ రివ్యూ
డీసెంట్ థ్రిల్లర్.. నెక్ట్స్ సీక్వెల్ కి లీడ్ ఇచ్చిన 'వి' థ్రిలర్స్ ని ఇష్టపడేవారిని ఆకట్టుకుంటుంది..

నటీనటులు : నాని, నివేదా థామస్, సుధీర్ బాబు, అదితి రావ్ హైదరి, జగపతి బాబు తదితరులు.

రచన,దర్శకత్వం : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

నిర్మాత : దిల్ రాజు

సంగీతం : అమిత్ త్రివేది

సినిమాటోగ్రఫర్ : పి.జి.విందా

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

నేచురల్ స్టార్ నాని, హీరో సుధీర్ బాబు కలయికలో టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'వి'. అదితి రావ్ హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. కాగా తాజాగా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ

పోలీస్ డిపార్డ్ మెంట్ లో సూపర కాప్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న డిసిపి ఆదిత్య ( సుధీర్ బాబు) తన డిపార్ట్ మెంట్ లో పోలీస్ అధికారి హాత్య సవాల్ గా మారుతుంది..ఆ హాంతకుడు ఆదిత్యను ఛాలెంజ్ చేస్తాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పై కథను రాసేందుకు తనను కలవడానికి వచ్చిన అపూర్వ(నివేధా) తో ప్రేమలో పడతాడు ఆదిత్య.. ఆ హాంతకుడు తను చేయబోయే హాత్యలకు సంబంధించిన క్లూస్ ఇచ్చిమరీ చంపుతుంటాడు.. మొత్తం ఐదు హాత్యలు చేస్తానని చేతనయితే పట్టుకోమని సవాల్ విసిరిన హాంతకుడు వదిలిన క్లూ లలో ఒకటి 'వి'. అసలు అతను ఎవరు..? ఆ హాత్యలకు కారణం ఏంటి..? ఆదిత్య తనకు ఎదురైన సవాల్ ను ఎలా సమాధానం చెప్పాడు అనేది మిగిలిన కథ..?

కథనం:

ఇమేజ్ బ్రేక్ చేయడం అంత తేలిక కాదు.. జర్సీ తో నాని ఆ ఫీట్ ని సక్సెస్ పుల్ గా చేసాడు..ఇప్పుడు పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా నాని చేసిన 'వి'. నటన పరంగా తనకు మంచి మార్కులు దక్కాయి. ఎక్కడా నవ్వించే నాని ని కనిపించనివ్వలేదు.. నాని ఎంట్రన్స్ తో సినిమా అసలు కథలోకి వెళుతుంది. సుధీర్ బాబు తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. అతని ఇంట్రడక్షన్ బాగుంది. అక్కడి నుండి అతని ప్రేమకథ కథను కాస్త తేలిక చేసింది. నివేదా థామస్ పాత్ర నుండి ఎక్స్ పెక్ట్ చేయడానికి ఏమీలేకుండా పోయింది. క్యూట్ గాళ్ గా మాత్రమే కనిపించింది. హాత్య తర్వాత హాత్య కు సినిమా లో స్పీడ్ పెరగాలి కానీ.. ఎందుకో అది జరగలేదు.. హాత్య జరగడం.. తర్వాత పోలీసులు రావడం.. విలన్ హీరోకి దొరికిపోతాడు.. దొరికిపోయాడు.. దొరికితే ఎలా ఇలాంటి ఫీలింగ్ లను పెద్ద గా ప్రేక్షకులకు దొరకలేదు.. నాని తన జర్నీలో కలిసే ఇద్దరి ప్రయాణికులతో సీన్స్ లో నాని నవ్వకుండా నవ్వించాడు.. ఇక ప్లాష్ బ్యాక్ తో దర్శకుడు కథను మరింత రోటీన్ గా మార్చాడు.. అక్కడి నుండి కథ పెద్ద పట్టు లేకుండా సాగుతుంది..

నాని తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు.. పిజివింద సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. కథను మలుపు తిప్పే అదితి క్యారెక్టర్ కి మరికొంత ఫీల్ ని యాడ్ చేసుంటే బాగుండేది అనిపించింది. సుధీర్ బాబు తన హీరోయిజాన్ని బాడీతోనే కాకుండా వాయిస్ తోనే పలికించాడు. క్లైమాక్స్ ఫైట్ ని బాగా డిజైన్ చేసాడు దర్శకుడు ఇంత సీరియస్ సబ్జెక్ట్ లో సినిమాల మీద సెటైర్స్ వేస్తూ నానీ ఎంటర్ టైన్ చేసాడు. వి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని మిస్ అయినా ఓటిటిలో వి సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసింది. సుధీర్ బాబు స్క్రీన్ ప్రజెన్స్ 'వి' కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఐడియల్ పోలీస్ పాత్రను సమర్ధవంతంగా పోషించాడు సుధీర్ బాబు. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది.. నెక్ట్స్ సీక్వెల్ కి లీడ్ ఇచ్చిన వి థ్రిలర్స్ ని ఇష్టపడేవారిని ఆకట్టుకుంటుంది..

చివరిగా:

డీసెంట్ థ్రిల్లర్

-కుమార్ శ్రీరామనేని

Tags

Read MoreRead Less
Next Story