Vaarasudu : 'వీరసింహారెడ్డి'తో పెట్టుకుంటే కష్టం.. వెనక్కి తగ్గిన 'వారసుడు'

Vaarasudu : వీరసింహారెడ్డితో పెట్టుకుంటే కష్టం.. వెనక్కి తగ్గిన వారసుడు
Vaarasudu : నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం వీర సింహారెడ్డి ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా USA లో ప్రీ-సేల్స్ పట్ల కూడా నిర్మాతలు సంతృప్తికరంగా ఉన్నారు.

Vaarasudu: నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం వీర సింహారెడ్డి ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా USA లో ప్రీ-సేల్స్ పట్ల కూడా నిర్మాతలు సంతృప్తికరంగా ఉన్నారు. ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలవుతోంది. బాలయ్య అభిమానులు ఈ చిత్రం తమ హీరో కెరీర్-బెస్ట్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. అతని చివరి సూపర్ హిట్ అఖండను అధిగమిస్తుందని నమ్మకంగా ఉన్నారు.


ఇప్పుడు మరో శుభవార్త బాలయ్య అభిమానులకు మరింత జోష్‌ను ఇస్తుంది. జనవరి 12న విడుదల కావాల్సిన తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన 'వారసుడు' చిత్రం వాయిదా పడింది. బాలయ్య బాబుని ఢీకొట్టడం కష్టమని భావించి వారసుడు చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయడానికి సిద్ధపడింది. ఇది బాలయ్య చిత్రానికి మొదటి రోజు భారీ కలెక్షన్లు రాబట్టడానికి మార్గం సుగమం చేసింది. ఎందుకంటే వీరసింహారెడ్డి పోటీ వచ్చేవాళ్లు ఎవరూ ఉండరు ఆరోజు.


ఇక ఇప్పుడు బాలకృష్ణ వీర సింహ రెడ్డి అత్యధిక స్క్రీన్‌లలో సోలోగా విడుదలవనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు తమన్ సంగీతం అందించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో బాలకృష్ణ సరసన తొలిసారి శృతి హాసన్ నటిస్తుంది.


వారసుడు చిత్ర యూనిట్ తీసుకున్న నిర్ణయం చిరంజీవి వాల్తేరు వీరయ్యకు కూడా ప్రయోజనం చేకూర్చింది. వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ నెగిటివ్ రోల్స్‌ పోషించారు.

Tags

Read MoreRead Less
Next Story